పెబ్బేరులో రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2021-01-21T03:44:25+05:30 IST
పెబ్బేరు మునిసిపాలిటీ పరిధిలోని సత్యసాయి రైస్ మిల్లుపై పౌర సరఫరాల శాఖ అధికారి రేవతి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు.

- రైస్ మిల్లు సీజ్
పెబ్బేరు, జనవరి20: పెబ్బేరు మునిసిపాలిటీ పరిధిలోని సత్యసాయి రైస్ మిల్లుపై పౌర సరఫరాల శాఖ అధికారి రేవతి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 350 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, మిల్లును సీజ్ చేసినట్లు ఆమె తెలిపారు.