రెండో విడత వ్యాక్సినేషన్ షురూ
ABN , First Publish Date - 2021-02-07T03:14:34+05:30 IST
కొవిడ్-19 వ్యాక్సిన్ రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రారంభించారు.

వనపర్తి టౌన్, ఫిబ్రవరి 6: కొవిడ్-19 వ్యాక్సిన్ రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రారంభించారు. జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన వ్యాక్సిన్ పంపిణీ కేంద్రం ద్వారా 100మంది పోలీస్ సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయాలని ప్రణాళికలు రూపొందించారు. కాగా కేవలం 60 మంది పోలీసులు వ్యాక్సిన్ తీసుకున్నారు. డీఎస్పీ కిరణ్‌కుమార్, సీఐ సూర్యనాయక్ టీకాను వేయించుకున్నారు. సోమవారం నుంచి మరిన్ని వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు.