గణ.. గణ.. గణ.. గణ

ABN , First Publish Date - 2021-02-02T04:07:32+05:30 IST

కరోనా వ్యాప్తితో 11 నెలల తరువాత ప్రభు త్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, క ళాశాలలు ఎట్టకేలకు తెరు చుకున్నాయి.

గణ.. గణ.. గణ.. గణ
మహబూబ్‌నగర్‌లోని మోడల్‌ బేసిక్‌ స్కూల్‌లో విద్యార్థినితో సంతకం తీసుకుంటున్న టీచర్‌

11 నెలల తరువాత తెరుచుకున్న పాఠశాలలు

- ఉమ్మడి పాలమూరు జిల్లాలో పునః ప్రారంభమైన బడులు, కాలేజీలు

- మొదటి రోజు నామమాత్రంగా హాజరైన విద్యార్థులు

- థర్మల్‌ స్కానింగ్‌ అనంతరమే ప్రవేశానికి అనుమతి

- ఒక్కో తరగతిలో 20 మందినే కూర్చోబెట్టిన అధికారులు

- కొన్ని పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘన


మహబూబ్‌నగర్‌ (విద్యావిభాగం)/ నాగ ర్‌కర్నూల్‌ టౌన్‌/ నారా యణపేట/వనపర్తి రూర ల్‌/ (గద్వాల-ఆంధ్రజ్యోతి), ఫిబ్రవరి 1 : కరోనా వ్యాప్తితో 11 నెలల తరువాత ప్రభు త్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, క ళాశాలలు ఎట్టకేలకు తెరు చుకున్నాయి. కొవిడ్‌-19 నిబం ధనలు పాటిస్తూ సోమవారం నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 9, 10వ తరగతుల విద్యార్థులకు తరగతి గదిలో ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. ఎన్నో జాగ్రత్తల నడుమ తరగతులు మొదలైనా, మొదటి రోజు హాజరు శాతం అంతంత మాత్రంగానే నమోదైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పాఠశాల, కళాశాల వద్ద ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. వైద్య, ఆరోగ్య సిబ్బందిని, మందులను అందుబాటులో ఉంచారు. తరగతి గదులు, కా ర్యాలయాలను శానిటైజ్‌ చేశారు. వచ్చిన విద్యా ర్థులందరికీ థర్మల్‌ స్కానింగ్‌ చేశారు. చేతులకు శానిటైజర్‌ వేయడంతో పాటు మాస్కు ధరించే లా చర్యలు తీసుకున్నారు. తరగతుల్లో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. అయితే మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్వహణకు స్కా వెంజర్లు లేకపోవడంతో ఉపాధ్యాయులు, వి ద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.

- మహబూబ్‌నగర్‌ జిల్లాలో సోమవారం 135 ప్రభుత్వ పాఠశాలలు, 170 ప్రైవేట్‌ పా ఠశాలలు తెరుచుకున్నాయి. ఈ పాఠశాలల్లో 9, 10వ తరగతులకు సంబంధించి 28,732 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, మొదటి రోజు 15 వేల మంది హాజరయ్యారు. విద్యార్థు లు బడులకు రాగానే ముందుగా ఉపాధ్యాయు లు వారికి థర్మల్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహిం చారు. అనంతరం శానిటైజ్‌ అందించి, వారిని త రగతి గదులలోకి పంపారు. ఒక్కో గదిలో 20 మందిని మాత్రమే అనుమతించారు. భౌతికదూ రం పాటించేలా సీట్లు కేటాయించారు. కొవిడ్‌-19 నిబంధనల మేరకు ఏ పాఠశాలలో కూడా ప్రేయర్‌ నిర్వహించలేదు.


- నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 59 ప్రభుత్వోన్నత పాఠశాలలు సోమవారం తెరుచుకున్నాయి. 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు మొత్తం 4,223 ఉన్నారు. అందులో తొమ్మిదో తరగతిలో 2,103 విద్యార్థులకు గాను 607 మంది, 10వ తరగతిలో  2,120 విద్యార్థు లకు 1,009 మం ది హాజరయ్యారు. అ న్ని పాఠశాలలు, కళాశాలల్లో తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం ఉంటేనే విద్యార్థులను తరగతి గదులలోకి రానిచ్చారు. ప్రవేశ ద్వారం వద్ద విద్యార్థులకు శానిటైజ్‌ చేసి తరగతి గ దులలోకి పంపారు. కాగా, బడుల్లో స్కావెంజర్లు లేకపోవడంతో ముందస్తుగా గ్రామ పంచాయతీ పారిశుధ్య సిబ్బందితో తరగతి గదులను శుభ్రం చేయించారు.


- నారాయణపేట జిల్లాలో 9, 10వ తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్‌, డిగ్రీ కళాశాలలు, కస్తూర్బా, వసతి గృహాలు సోమవారం ప్రారం భం అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సం స్థల్లో 9వ తరగతి విద్యార్థులు 8,719 మందికి గాను 3,014 మంది, పదో తరగతిలో 8,216 మంది విద్యార్థులకు 3,770 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. ఇంటర్‌ మొదటి సం వత్సరంలో 753 మంది విద్యార్థులకు 64 మంది, ద్వితీయ సంవత్సరంలో 816 మంది విద్యార్థుల కు 73 మంది హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 18,504 మంది విద్యార్థులకు 6,921 మంది హాజ రు కాగా, 37.4 శాతం హాజరు నమోదైంది.


- వనపర్తి జిల్లాలో మొత్తం 175 పాఠశాల ల్లో 15,219 మంది విద్యార్థులు 9, 10వ తరగతి చదువుతున్నారు. సోమవారం బడులు తెరుచు కోగా 5,204 మంది హాజరయ్యారు. కొన్ని పాఠ శాలల్లో శానిటైజర్‌, సామాజిక దూరం, మాస్క్‌ లు ధరించాలనే నిబంధనను పాటించలేదు. వ నపర్తి మండలం కడుకుంట్ల గ్రామ ఉన్నత పా ఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులు వారి త రగతి గదులు వారే శుభ్రం చేసుకొని కూర్చున్నా రు. తరగతి గదిలో ఉండే పాత పాఠ్య పుస్తకా లు విద్యార్థులే తీసి వేరు చేస్తున్నారు. వనపర్తి జిల్లా బాలుర ఉన్నత పాఠశాల, బాలికల ఉన్న త పాఠశాలలో సామాజిక దూరంతో పాటు మాస్క్‌లు ధరించి తరగతిలో కూర్చున్నారు.


- జోగుళాంబ గద్వాల జిల్లాలో సోమవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు 79 హైస్కూల్స్‌, 12 క స్తూర్బాలు, ఒక మోడల్‌ స్కూల్‌ ప్రారంభమ య్యాయి. హైస్కూళ్లలో తొమ్మిదో తరగతిలో మొత్తం 5,555 విద్యార్థులకు గాను 1,584 మం ది హాజరయ్యారు. పదో తరగతిలో 5,378 మం దికి గాను 2273 మంది హాజరయ్యారు. కస్తూ ర్బా పాఠశాలల్లో 9వ తరగతిలో 509 మందికి ఎనిమిది మంది, పదో తరగతిలో 437 మందికి 101 మంది విద్యార్థినులు హాజరయ్యారు. మోడ ల్‌ స్కూల్‌లో 9వ తరగతిలో 78 మంది. పదో తరగతిలో 78 మంది ఉండగా, రెండు తరగతులకు ఐదుగురు మాత్రమే తొలి రోజూ వచ్చారు.

Updated Date - 2021-02-02T04:07:32+05:30 IST