సంప్రదాయబద్ధంగా భోగి పండుగ

ABN , First Publish Date - 2021-01-14T03:25:04+05:30 IST

జిల్లా వ్యాప్తం గా సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. బుధవారం భోగి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.

సంప్రదాయబద్ధంగా భోగి పండుగ
అయిజలో ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న మహిళలు

- రంగవల్లులతో కళకళలాడిన లోగిళ్ళు 

- ప్రధాన దేవాలయాల్లో గోదా దేవి కళ్యాణం 

- గాలి పటాలు ఎగురవేసిన యువకులు, చిన్నారులు 

గద్వాల టౌన్‌/ రాజోలి/ అయిజ/ మానవపాడు, జనవరి 13 : జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. బుధవారం భోగి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజామునే మహిళలు, యువతులు రంగవల్లులను తీర్చిదిద్దారు. ముగ్గులపై గొబ్బెమ్మలను అలంకరించి పూజలు చేశారు. యువకులు, చిన్నారులు గాలి పటాలు ఎగురవేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గద్వాల బీరెల్లి క్రాస్‌ సమీపంలో భోగి మంటలు వేసి వేడుకలు నిర్వహిచారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు లక్ష్మీ నరసింహ, నాగలత, గీతమ్మ, టీఆర్‌ఎస్‌ నాయకుడు సాయి శామ్‌ రెడ్డి, నాగులయాదవ్‌, రాము, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు వెంగల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజోళి మండలంలోని మాన్‌దొడ్డి గ్రామంలో లక్ష్మీ మాధవస్వామికి బుధవారం ఉదయం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజోల ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అయిజ, మానవపాడు మండలాల్లో భోగి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.


వైభవంగా గోదా కల్యాణం

    గద్వాల టౌన్‌/ఇటిక్యాల: భోగి పండుగను పురస్కరించుకొని పట్టణంలోని రంగనాథ స్వామి, సంతానగోపాల స్వామి ఆలయాల్లో బుధవారం గోదాదేవి రంగనాథ స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకుడు గోవర్ధన్‌. విజయభాస్కరాచార్యులు అధ్యర్యంలో వేడుకను నిర్వహిం చారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు, సంయుక్తమ్మ, ప్రకాశ్‌రెడ్డి, రజిత దం పతులతో పాటు 16జంటలు కల్యాణోత్సవంలో పాల్గొన్నాయి. అనంతరం కళాకా రుడు వేణుగోపాలాచారి ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు అందరినీ అల రించాయి. ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి కోదండరామాలయంలో గోదా దేవి కల్యాణాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అర్చకులు భువనచంద్రాచార్యులు ఆధ్వర్యంలో ఉత్సవం నిర్వహించినట్లు మేనేజర్‌ సురేంద్రరాజు తెలిపారు.  Updated Date - 2021-01-14T03:25:04+05:30 IST