‘తుంగ’లో ఇసుక తోడేళ్లు

ABN , First Publish Date - 2021-08-11T04:51:56+05:30 IST

తుంగభద్ర నది నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది.

‘తుంగ’లో ఇసుక తోడేళ్లు
రాజోలిలో డంప్‌ చేసిన ఇసుకను ఎక్స్‌కవేటర్‌ ద్వారా టిప్పర్‌లోకి నింపుతున్న దృశ్యం (ఫైల్‌)

- తుంగభద్ర నదికి వరద రాకముందే ఇసుక తోడివేత

- సమీప ప్రాంతాల్లో డంప్‌ చేసి అక్రమంగా రవాణా

- దాడులు  చేస్తున్నా మారని మాఫియా

- అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల కనుసన్నల్లోనే సాగుతున్న దందా


అలంపూర్‌, ఆగస్టు 10 : తుంగభద్ర నది నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. జో గుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ నియోజకవర్గం లో మాత్రమే ఈ నది ప్రవహిస్తుంది. జిల్లాలో కృ ష్ణానది ప్రవహిస్తున్నా, ఈ నదిలో ఇసుక లభ్యత ఉండదు. దీంతో ఇసుక మాఫియా కన్ను తుంగభ ద్ర నదిపై పడింది. అలంపూర్‌ నియోజకవర్గంలోని నదీ తీర గ్రామాలైన అలంపూర్‌, పుల్లూరు, కొరివిపాడు, మెన్నిపాడు, రాజోలి, తుమ్మిళ్ల, మాన్‌దొడ్డి, వేణిసోంపురం, కుట్కనూరు, రాజాపురం ప్రాంతా ల్లో ఇసుక మాఫియా తిష్ట వేసింది. వరదలు రాక ముందే ఎక్స్‌కవేటర్లతో నదిలో ఇసుకను తోడి, స మీప ప్రాంతాల్లో డంప్‌ చేస్తోంది. అనంతరం రెవె న్యూ, పోలీసు అధికారుల కన్ను కప్పి ఇతర ప్రాం తాలకు తరలించి, కోట్లకు పడగలెత్తుతోంది.


కేసులు పెట్టినా.. ఆగని దందా

అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను, మాఫియా డంప్‌ చేసిన ఇసుక నిల్వల ను పోలీస్‌, రెవెన్యూ శాఖలు స్వాధీనం చేసుకొని కే సులు పెడుతున్నా, ఇసుక వ్యాపారం కొనసాగుతూ నే ఉన్నది. అలంపూర్‌ మండలం సుల్తానాపురంలో 35 ట్రాక్టర్ల ఇసుక డంపును రెవెన్యూ అధికారులు గుర్తించి సీజ్‌ చేశారు. అలాగే రాజోలి మండలంలో 390 ట్రాక్టర్ల ఇసుక డంపులు, అయిజ మండలంలో 39 ఇసుక ట్రాక్టర్ల డంపులను, ఉండవెల్లి మండలం పుల్లూరు, మెన్నిపాడు, కొరివిపాడు గ్రామాల పరిధిలో దాదాపు 60 ట్రాక్టర్ల ఇసుక డంపులను స్వాధీ నం చేసుకున్నారు. అలాగే ఈ మండలానికి చెం దిన పది మందిపై కేసులు నమోదు చేశారు. కాగా, అలంపూర్‌ మండలం గొందిమల్ల, బుక్కాపురం, ఊట్కూరు, భీమవరం, క్యాతూరు గ్రామాలలో ఇసుక డంపులు అధికంగా ఉన్నట్లు సమాచారం.


అనుమతుల పేరుతో.. 

అధికారులు సీజ్‌ చేసిన ఇసుకపై అధికార పార్టీ కి చెందిన కొందరు నాయకుల కన్ను పడింది. దీం తో ఆ ఇసుకను మొత్తానికి మొత్తం తరలించేందు కు వారు వ్యూహాలు పన్నుతున్నారు. ముందుకు డంప్‌ చేసిన ఇసుక తరలింపునకు అనుమతులు తీ సుకుంటున్నారు. ఆ తరువాత మొతానికి మొత్తం ఇసుకను మాయం చేస్తున్నారు. వాస్తవానికి ఒక ట్రాక్టర్‌కు మూడు క్యూబిక్‌ మీటర్లు, ఒక టిప్పర్‌కు 15 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తరలించే సామర్థ్యం ఉంటుంది. దాని ప్రకారమే అధికారులు ఇసుక తర లింపునకు అనుమతులు ఇస్తారు. కానీ, ఈ నాయ కులు మాత్రం అనుమతులు తీసుకొని అధిక క్యూబిక్‌ మీటర్ల ఇసుకను నింపుకొని, ఇసుకను పూర్తిగా మాయం చేస్తున్నారు. ఇందుకు కొందరు అధికారు లకు మామూళ్లు కూడా ముట్టజెబుతున్నట్లు ఆరోప ణలు కూడా ఉన్నాయి.


స్కందలో అధికార పార్టీ ఇసుక దంద

ఉండవెల్లి మండలం పుల్లూరు చెక్‌పోస్ట్‌ వద్ద ఉ న్న స్కంద కాలనీ తుంగభద్ర నదికి ఆనుకొని ఉం టుంది. ఇక్కడ ఇసుక నిల్వ అధికంగా ఉంది. దీంతో ఈ ప్రాంతాన్ని అధికార పార్టీకి చెందిన ఓ నాయ కుడు చెరబట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా టిప్పర్‌లలో ఇసుకను నింపి, దాని పైన కంకరను పోసి అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్నాడు. ఇం దుకు ఆయన మైనింగ్‌, పోలీస్‌ శాఖలని కొందరితో చేతులు కలిపినట్లు సమాచారం. కొందరు పోలీసులు కూడా ఎస్‌ఐ కదలికలను సదరు నాయకుడికి ఎప్పటికప్పుడు చేరవేస్తున్నట్లు తెలిసింది. అలాగే పోలీసులు సీజ్‌ చేసిన ఇసుకను తరలించడానికి, రాత్రికి రాత్రే మైనింగ్‌ శాఖలోని ఓ అధికారి అను మతులు ఇస్తుండటం పలు అనుమానాలకు తావి స్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పం దించి, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మో పాల్సిన అవసరం ఉన్నది. అలాగే మాఫియాకు స హకరిస్తున్న కొందరు అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ వినిపిస్తోంది.

Updated Date - 2021-08-11T04:51:56+05:30 IST