సం‘భ్రాంతి’

ABN , First Publish Date - 2021-01-14T03:45:37+05:30 IST

నియంత్రిత సాగు విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాల సాగును ప్రోత్సహించింది.

సం‘భ్రాంతి’
శేరుపల్లి వద్ద వర్షాలకు కొట్టుకుపోయిన వరిని చూపుతున్న రైతు (ఫైల్‌)

- పల్లెల్లో కళ తప్పిన సంక్రాంతి 

- చేదు అనుభవాలను మిగిల్చిన కరోనా మహమ్మారి

- భారీ వర్షాలతో దెబ్బతిన్న వరి, పల్లి, కంది, పత్తి 

- 60 శాతం మేర తగ్గిన దిగుబడి

- వానాకాలం సీజన్‌లో నష్టపోయిన రైతులు 

- యాసంగిలోనూ తప్పని కష్టాలు


వనపర్తి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : నియంత్రిత సాగు విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాల సాగును ప్రోత్సహించింది. దీంతో గత వానాకాలం సీజన్‌లో ఉమ్మడి పాలమూరుకు చెందిన రైతాంగం దా దాపు నాలుగు లక్షల ఎకరాల్లో వరి పంటలను సాగు చేయగా, అందులో 80 శాతం మేర సన్నాల సాగును చేపట్టింది. బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 రకాలకు ఎక్కువగా పండించారు. అయితే, సన్నరకాలు పంట కాలం ఎక్కువగా ఉండటం, అధిక వర్షాలు కురవడంతో వ్యాపించిన వేరుకుళ్లు, అగ్గితెగులు, సూడిదోమ రో గాల వల్ల పంట పూర్తిగా దెబ్బతిన్నది. పొలాల్లో ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉన్న కారణంగా వేరుకుళ్లు వ్యాధి వ్యాప్తి చెందింది. వరి కంకి దశలో ఉన్న సమయంలో అధిక వర్షపాతం నమోదు కావడంతో, జిల్లాల్లో మెజారిటీ పంట నేలకొరిగింది. ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు రావాల్సిన దిగుబడి 18 నుంచి 24 క్వింటాళ్లకు పడిపోయింది. అదే క్రమంలో ఈసారి ప్రైవేటు కొనుగోళ్ల ప్రోత్సాహంతో రైతుకు సరైనా మద్దతు ధర లభిం చలేదు. ధాన్యం నల్లగా మారడంతో కొర్రీలు పెట్టి కొనుగోలు చేయడంలో ఆలస్యమైంది. పంట దిగుబడి త గ్గిపోవడంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. వనపర్తి జిల్లాలో కూలీల రేట్లు కూడా గణనీయం గా పెరిగాయి. కరోనా కారణంగా కూలీల కొరత ఏర్పడటంతో రోజుకు ఒక్కో కూలి సుమారు రూ.వెయ్యి వరకు తీసుకున్నారు. 


మిగతా పంటలూ అంతే..

ఉమ్మడి జిల్లాలో వరి మినహా ప్రధానంగా సాగయ్యేవి పత్తి, వేరుశనగ, కంది పంటలు. వీటి దిగుబడి కూడా ఈసారి తగ్గిపోయింది. కంది సాగు నారాయణపేట, గద్వాల, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు జిల్లా ల్లో ఎక్కువగా జరిగింది. మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా రైతులను కంది, పత్తిసాగు చేయాలని ప్రభు త్వం ప్రోత్సహించింది. దీంతో ఆయా పంటలు గణనీయంగా సాగయ్యాయి. అయితే, పత్తి సాధారణ దిగుబ డి ఎకరాకు 14 నుంచి 16 క్వింటాళ్ల వరకు రావాల్సి ఉండగా, నాలుగు నుంచి ఆరు క్వింటాళ్లకు తగ్గిపోయిం ది. పెట్టుబడి భారం ఎక్కువ కావడంతో చివరి దశలో పత్తిని తీయకుండానే పలువురు రైతులు వదిలేశారు. గద్వాల, మహబూబ్‌నగర్‌, నాగర్‌ర్నూలు, నారాయణపేట జిల్లాలో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కంది సాగు కూడా భారీగా చేపట్టారు. కంది సాధారణ దిగుబడి ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్లు రావాల్సి ఉండగా, 5 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. వేరుశనగ అత్యధికంగా సాగయ్యే నాగర్‌కర్నూ లు, వనపర్తి జిల్లాల్లో ఈసారి దిగుబడి అమాంతం పడిపోయింది. ఒక ఎకరాకు 25 నుంచి 30 బస్తాల వర కు దిగుబడి రావాల్సి ఉండగా, కొందరికి 9 నుంచి 12 బస్తాల దిగుబడే రావడం గమనార్హం. రెండు వరుస తుఫాన్లతో గింజ బలంగా రాకపోవడంతో నాణ్యత దెబ్బతిన్నది. ధరలు అధికంగా ఉండటం ఇక్కడ రైతుల కు కొంత ఊరట కలిగించింది. వానాకాలం, ముందస్తు రబీలో సాగుచేసిన ఏ ఒక్క పంట కూడా ఈ సంవ త్సరం రైతులకు మేలు చేయలేదు. దిగుబడి పూర్తిగా తగ్గిపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

Updated Date - 2021-01-14T03:45:37+05:30 IST