గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి

ABN , First Publish Date - 2021-01-14T03:08:39+05:30 IST

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిం చేందుకు క్రీడా పోటీలు దోహదప డుతాయని కల్వకుర్తి గుర్క ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ అన్నారు.

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి
కుర్మిద్దలో క్రీడలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

కల్వకుర్తి అర్బన్‌, జనవరి 13: గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిం చేందుకు క్రీడా పోటీలు దోహదప డుతాయని  కల్వకుర్తి గుర్క ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ అన్నారు. గెలుపు ఓటములను క్రీడాకారులు సమానంగా స్వీకరించాలన్నారు. కు ర్మిద్ద గ్రామంలో ప్రవీణ్‌ రెడ్డి జ్ఞాప కార్థం ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీ లను, యంగంపల్లి గ్రామంలో వాలీబాల్‌ టోర్నమెంట్‌ను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు గోలీ శ్రీనివాస్‌ రెడ్డి, సర్పంచ్‌లు శ్వేత, జ్యోతి, ఎంపీటీసీ శంకర్‌, మునిసిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం, మార్కెట్‌ చైర్మన్‌ బాలయ్య, వైస్‌ చైర్మన్‌ విజయ్‌ గౌడ్‌, ఎంపీపీ సునీత, కాటన్‌ మిల్లు అధ్యక్షుడు సూర్య ప్రకాశ్‌, ఉప సర్పంచ్‌ రవీందర్‌, ఎంపీటీసీలు సంతోష, శోభ, మాజీ సర్పంచ్‌ దామోదర్‌ గౌడ్‌, నాయకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అలాగే, విద్యానగర్‌ కాలనీలో ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. 



Updated Date - 2021-01-14T03:08:39+05:30 IST