‘భవన నిర్మాణ కార్మికులకు, రైతు కూలీలకు రూ.10 వేలు ఇవ్వాలి’
ABN , First Publish Date - 2021-05-09T04:11:12+05:30 IST
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలోని భవన నిర్మాణ కార్మికులు, రైతు కూలీలకు కరోనా కాలంలో ఎలాంటి పనులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుబానికి రూ.10వేలు ఇవ్వా లని బీసీ సేన రాష్ట్ర కార్యదర్శి కృష్ణ యాదవ్ డిమాండ్ చేశా రు.

బాదేపల్లి, మే 8 : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలోని భవన నిర్మాణ కార్మికులు, రైతు కూలీలకు కరోనా కాలంలో ఎలాంటి పనులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుబానికి రూ.10వేలు ఇవ్వా లని బీసీ సేన రాష్ట్ర కార్యదర్శి కృష్ణ యాదవ్ డిమాండ్ చేశా రు. శనివారం పట్టణంలోని ఎమ్మార్సీ కార్యాలయ ఆవరణలో విలేకర్లతో మాట్లాడారు. తమిళనాడు రాష్ట్రంలో ప్రతీ రేషన్ కార్డుకు రూ.4వేలు ఇస్తున్నట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ఏర్పాటు చేసి కరోనా కట్టడికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు చెన్నయ్య, స్వామి, ఖాజానసీరుద్దీన్, గౌరీశంకర్, యాదయ్య ఉన్నారు.