ఘనంగా ముక్కోటి వృక్షార్చన
ABN , First Publish Date - 2021-07-25T04:17:03+05:30 IST
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ ఆర్ జన్మదిన వేడుకలను జిల్లాలో శనివారం ఘనం గా నిర్వహించారు. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు.

మహబూబ్‌నగర్/జడ్చర్ల/అడ్డాకుల/రాజాపూర్/బాలానగర్/హన్వాడ/మూసాపేట/గండీడ్/సీసీకుంట/మహబూబ్‌నగర్ విద్యావిభాగం/మిడ్జిల్/దేవరకద్ర, జూలై 24: రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ ఆర్ జన్మదిన వేడుకలను జిల్లాలో శనివారం ఘనం గా నిర్వహించారు. ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు. మహబూబ్‌నగర్ ఎక్సైజ్ ఎస్‌హె చ్‌వో పరిధిలో గల రూరల్ మండలం, హన్వాడ, దేవరకద్ర, నవాబ్‌పేట మండలాల్లో ఎక్సైజ్ పోలీసులు 5,850 ఈత మొక్కలను నాటారు. జడ్చర్ల మసిపాలి టీ పరిధిలో ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి మొక్కలు నాటారు. క్లబ్ రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయ కులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. యువ కులు ముఖానికి కేటీఆర్ చిత్రపటంతో కూడిన ఫేస్ మాస్క్‌లు ధరించారు. హ్యాపీ బర్త్‌డే కేటీఆర్, ముక్కో టి వృక్షార్చన అక్షరాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, జడ్పీ వైస్ చైర్మన్ కోడ్గల్ యాదయ్య పాల్గొన్నారు.
అడ్డాకుల: మండల పరిధిలోని పొన్నకల్ అను బంధ గ్రామం దుబ్బపల్లి గుట్టపై గల శివాలయంలో సర్పంచు కల్పన పూజలు నిర్వహించి, మొక్కలు నాటారు. మండల కేంద్రంలో ఎంపీపీ నాగార్జున్‌రెడ్డి, సర్పంచు మంజుల, ఎస్‌ఐ నరేశ్, విండో అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి కేక్ కట్ చేసి మొక్కలను నాటారు.
రాజాపూర్: మండల కేంద్రంలోని ముఖ్య కూడలిలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కేటీఆర్ బర్త్‌డే నిర్వ హించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజ రై, కేక్ కట్ చేశారు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవ రణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, ఎంపీపీ సుశీల పాల్గొన్నారు.
బాలానగర్: మండల పరిధిలోని బోదగుట్ట తండా, గౌతాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి శని వారం మొక్కలు నాటారు. గౌతాపూర్‌లో 35 పశు వులను రైతులకు అందించారు. బోదగుట్ట తండాలో మోగా పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ, జడ్పీటీసీ పాల్గొన్నారు.
మూసాపేట: మండలంలోని చక్రాపూర్‌లో 10 వేల మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే ఆల వెంక టేశ్వర్‌రెడ్డి పాల్గొని, కేక్ కట్ కట్ చేశారు. అనంతరం మొక్కలను నాటారు. కార్య క్రమంలో జడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ గూపని కళావతి, ఎంపీడీవో, తహసీల్దార్ పాల్గొన్నారు.
హన్వాడ: మండలంలోని కిష్టంపల్లిలో రైతు సేవా సహకార సంఘం చైర్మన్ వెంకటయ్య, సర్పంచి సరస్వతి ఆధ్వర్యంలో 3,000 మొక్కలు నాటారు. హన్వాడలో సర్పంచి రేవతి, తహసీల్దార్ శ్రీనువాస్, మండల అధికారులు, నాయకులు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమన్ని నిర్వహించారు. మాదారం మెగా పల్లె ప్రకృతి వనంలో ఎంపీపీ బాలరాజు, రైతు సమితి జిల్లా డైరెక్టర్ రమణారెడ్డి మొక్కలు నాటారు.
గండీడ్: మండలంలోని గోవింద్‌పల్లితండా మెగా ప్రకృతి వనంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను శనివారం నిర్వహించారు. పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. కార్యక్రమం సర్పంచ్ రవీందర్‌నాయక్, ఎంపీపీ మాధవి, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ గ్రంథాలయం వద్ద మొక్కలు నాటారు.
చిన్నచింతకుంట: మండలంలోని గూడూరు శివారులోని మెగా పార్కు వద్ద, మండల కేంద్రంలోని పీహెచ్‌సీ, తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణాసుధాకర్‌రెడ్డి మొక్కలు నాటారు. కా ర్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ వట్టెం రాజేశ్వరి, సర్పంచ్‌లు మోహన్‌గౌడు పాల్గొన్నారు.
మిడ్జిల్: మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో టీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవ రణలో, మెగా ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శశిరేఖ, ఎంపీపీ కాంతమ్మ, తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర: పరిధిలోని నాగారంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మొక్కలు నాటారు. మార్కెట్ యార్డు గోదాముల వద్ద కూడా మొక్కలను నాట్టారు.
