ఘనంగా లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం

ABN , First Publish Date - 2021-02-27T03:35:27+05:30 IST

జిల్లా కేంద్రంలోని న్యూగంజ్‌ గల లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా  లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం
మహబూబ్‌నగర్‌లో కల్యాణాన్ని నిర్వహిస్తున్న పండితులు

పద్మావతి కాలనీ, ఫిబ్రవరి 26: జిల్లా కేంద్రంలోని న్యూగంజ్‌ గల లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణాన్ని నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సంమేతంగా వివాహం చేశారు. కార్యక్రమంలో భాగంగా గద్వాల చంద్రశేఖర్‌రావు సంగీత కచేరి నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ మాజీ ఛైర్మన్‌ చంద్రమౌళి గుప్త, వేదపండితులు, తిరుమలాచార్యు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T03:35:27+05:30 IST