3న మక్తల్‌కు రేవంత్‌రెడ్డి రాక

ABN , First Publish Date - 2021-02-27T05:01:06+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెల 3వ తేదీన టీపీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ రేవంత్‌రెడ్డి మక్తల్‌ పట్టణానికి వస్తున్నారని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు.

3న మక్తల్‌కు రేవంత్‌రెడ్డి రాక
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకులు ఆశిరెడ్డి, వి.శ్రీహరి

మక్తల్‌రూరల్‌, ఫిబ్రవరి 26 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెల 3వ తేదీన టీపీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ రేవంత్‌రెడ్డి మక్తల్‌ పట్టణానికి వస్తున్నారని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు టీపీసీసీ అధికార ప్రతినిధి రాజుల ఆశిరెడ్డి, నియోజకవర్గ నాయకులు, మాజీ జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ వి.శ్రీహరి శుక్రవారం మక్తల్‌లోని వాకిటి శ్రీహరి నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టభద్రులు, నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. పట్టభద్రుల సమస్యలు, హక్కుల సాధన కోసం పోరాడే చిన్నారెడ్డిని అత్యధిక మెజార్జీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సిములు, పార్టీ మండల అధ్యక్షుడు గణేష్‌, ఆనంద్‌గౌడ్‌, కృష్ణారెడ్డి, యజ్ఞేశ్వర్‌, ఆయుబ్‌ఖాన్‌, పరమేశ్‌, మక్తల్‌ పట్టణ అధ్యక్షుడురవికుమార్‌, నారాయణ, మీరజ్‌, అయ్యపురెడ్డి, నర్సింహ పాల్గొన్నారు. రేవంత్‌రెడ్డి పర్యటన సభకు పట్టభద్రులు, విద్యావం తులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.

Updated Date - 2021-02-27T05:01:06+05:30 IST