పనిభారాన్ని తగ్గించండి

ABN , First Publish Date - 2021-12-08T04:52:27+05:30 IST

వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఒక్కొక్కరం 12 గంటల పాటు విధులు నిర్వహించడంతో పనిభారం ఎక్కు వై అలసిపోతున్నామని, ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు కాకుండా, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల నిర్వహణకు అనుమతులు ఇవ్వాలని వ్యాక్సినేషన్‌(పూర్తి చేసే) ప్రక్రియలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు డిమాండ్‌ చేశారు.

పనిభారాన్ని తగ్గించండి
కలెక్టరేట్‌ ముందు ధర్నా చేస్తున్న ఏఎన్‌ఎంలు

- కలెక్టరేట్‌ ముందు ఏఎన్‌ఎంల ధర్నా 

- రెండేళ్ల నుంచి ప్రాణాలను  పణంగా పెట్టి పనిచేస్తున్నాం

- పనివేళలు మార్చాలని డిమాండ్‌ 

- కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత


మహబూబ్‌నగర్‌(కలెక్టరేట్‌), డిసెంబరు 7 : వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఒక్కొక్కరం 12 గంటల పాటు విధులు నిర్వహించడంతో పనిభారం ఎక్కు వై అలసిపోతున్నామని, ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు కాకుండా, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల నిర్వహణకు అనుమతులు ఇవ్వాలని వ్యాక్సినేషన్‌(పూర్తి చేసే) ప్రక్రియలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం వారు కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఏఎన్‌ఎంలు మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో గత రెండేళ్ల నుంచి రాత్రనక, పగలనక ప్రజల ప్రాణా లను పణంగా పెట్టి విధులు నిర్వహించామన్నారు. లీవులు కానీ, ఆదివారం సెలవు దినాలు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు గాను ఇప్పుడు తమ మెడ మీద కత్తిపెట్టి మరీ ఉదయం 8 నుంచి రాత్రి 8గంటల వరకు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయించుకుంటు న్నారని, ఇంటికి చేరేవరకు రాత్రి 10, 11 అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇంట్లో ఉన్న పిల్లలకు, భర్తకు, వృద్ధులకు పని చేయలేకపోతున్నామని, తమ శరీరం సహకరించడం లేదని పేర్కొన్నారు. 12 గంటల పాటు విధుల నిర్వహణలో అలసి పోతున్నామని, తమకూ సంసారం, పిల్లలు ఉన్నా రని, అధికార యంత్రాంగం పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. తమకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వహిం చేలా అనుమతులు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. సెలవు దినాలతో పాటు, ఆదివారాలు కూడా సెలవివ్వకుండా పనిచేయమంటే తమ అలసట తీరేదెలా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా తమపై పనిభారాన్ని తగ్గించాలని, షిఫ్ట్‌ సిస్టంగా పనిచేసేందుకు సిబ్బందిని పెంచాలని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌కు వినతిపత్రం అం దించారు. కార్యక్రమంలో సంఘాలకతీతంగా ఏఎన్‌ ఎంలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-08T04:52:27+05:30 IST