రవీందర్‌రెడ్డి కన్నుమూత

ABN , First Publish Date - 2021-10-29T05:10:25+05:30 IST

భూ వ్యవహారం, కమీషన్‌ పంచాయితీలో తన బంధువు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఉమ్మడి జిల్లా గ్రంథాలయసంస్థ మాజీ చైర్మన్‌ రెడ్డిగారి రవీందర్‌రెడ్డి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ గురువారం కన్ను మూశారు.

రవీందర్‌రెడ్డి కన్నుమూత
రెడ్డిగారి రవీందర్‌రెడ్డి (ఫైల్‌)

- చికిత్సపొందుతూ ఆసుపత్రిలో విడిచిన తుదిశ్వాస

- నేడు సంగినోనిపల్లిలో అంత్యక్రియలు

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 28: భూ వ్యవహారం, కమీషన్‌ పంచాయితీలో తన బంధువు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఉమ్మడి జిల్లా గ్రంథాలయసంస్థ మాజీ చైర్మన్‌ రెడ్డిగారి రవీందర్‌రెడ్డి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొం దుతూ గురువారం కన్ను మూశారు. కత్తిపోట్లు బలంగా తగల డంతో  వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాడికి పాల్ప డిన మోహన్‌రెడ్డి జూబ్లి హిల్స్‌ పోలీసులకు లొంగిపోయారు. హ త్యకు గల అసలు కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. కేవ లం మోహన్‌రెడ్డికి ఇవ్వాల్సిన రూ. 6 లక్షల కమీషన్‌ కోసమే హత్య చేశారా? లేక వెనుక ఉండి వేరెవరైనా హత్య చేయించారా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. గురువారం రాత్రి మృత దేహాన్ని ఆయన స్వగృహమైన కోయిలకొండ మండలం సంగినోని పల్లికి తీసుకువచ్చారు. శుక్రవా రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ స భ్యులు, కాంగ్రెస్‌పార్టీ నేతలు ప్రక టించారు. 

  రెండేళ్లుగా భూపంచాయితీ

రవీందర్‌రెడ్డి తన బంధువు ద్వారా గోటూరులో కొన్నేళ్లక్రితం 35 ఎకరాల పొలం కొనుగోలు చేశారు. ఈ పొలం ఇతరుల పేరిట అగ్రిమెంట్‌ చేయగా ఆ వ్యక్తులకు రవీందర్‌ర్డెకి తరువాత రోజుల్లో విభేదాలు రావడంతో పంచాయితీ ముదిరింది. పలుమా ర్లు రాజీకి ప్రయత్నించినా కుదరలేదు. ఏడాది క్రితమే రవీంద ర్‌ను హత మార్చేందుకు సుపారి మాట్లాడుకోగా ఆ విషయం ర వీందర్‌కు తెలియడంతో అప్రమత్తం అయ్యారు. ఈ విషయం లోనూ ఇరువర్గాలు రాజీపడినా లోలోన కక్షలు అదేవిధంగా ఉన్న ట్లు చెబుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో కొనుగోలు చేసిన స్థిరాస్థికి సంబంధించి కమీషన్‌ ఇవ్వలేదని హత్యకు పాల్పడిన మరో అంశం తెర పెకి వచ్చింది. పోలీసులు దీనిపై  విచారణ జరిపిస్తే అసలు విషయాలు వెలుగు లోకి వస్తాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మోహన్‌రెడ్డిని ముందుపెట్టి వెనక నుంచి కొన్ని శక్తులు కుట్రపన్నాయని చెబు తున్నారు. రవీందర్‌రెడ్డి కాల్‌ డాటాతోపాటు అనుమానితుల కాల్‌ డాటాను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.  ఈ యనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. 

 రవీందర్‌రెడ్డి  హత్య దారుణం  : రేవంత్‌ రెడ్డి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం అక్టోబరు : మహబూబ్‌నగర్‌ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్‌  రవీందర్‌రెడ్డిని హత్యచేయ డం అత్యంత దారుణమని టీపీసీసీ అఽధ్యక్షుడు ఎంపీ రేవంత్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో ఖండించారు. రవీందర్‌ రెడ్డి మరణం మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి తీరనిలోటు అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నదని, శాంతిభద్రతలు పూర్తి గా క్షీణించాయని ఆవేదన వ్వక్తం చేశారు.  దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆయన అత్మకు శాంతి చేకు రాల ని, వారి కుటుంబ సభ్యులకు  కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుం దన్నారు. అదేవిధంగా డీసీసీ అధ్యక్షుడు ఓబేదుల్లా కొత్వాల్‌, కాం గ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఎన్‌పీ వెంకటేష్‌, కాంగ్రెస్‌ పార్టీ  జిల్లా మహిళా అధ్యక్షురాలు అనితమ్మ, లక్ష్మణ్‌ యాదవ్‌, బెనహర్‌లు సంతాపం తెలిపారు.Updated Date - 2021-10-29T05:10:25+05:30 IST