కురిసిన వర్షం.. తడిసిన ధాన్యం

ABN , First Publish Date - 2021-05-06T05:06:55+05:30 IST

కురిసిన అకాలవర్షానికి బాదేపల్లి పత్తి మార్కెట్‌లో ఆ రబెట్టుకున్న ధాన్యం కొద్దిమేర తడిసింది. మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ప్ర భుత్వ వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి రైతులు వరిధాన్యంను పత్తి మార్కెట్‌కు తీసుకువచ్చారు.

కురిసిన వర్షం.. తడిసిన ధాన్యం
బాదేపల్లి పత్తి మార్కెట్‌లో తడిసిన తర్వాత ఆరబెట్టిన ధాన్యం

జడ్చర్ల, మే 5 : కురిసిన అకాలవర్షానికి బాదేపల్లి పత్తి మార్కెట్‌లో ఆ రబెట్టుకున్న ధాన్యం కొద్దిమేర తడిసింది. మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి రైతులు వరిధాన్యంను పత్తి మార్కెట్‌కు తీసుకువచ్చారు. తేమశాతం అధికంగా ఉండడంతో మార్కెట్‌ ఆవరణలో వరిధాన్యంను ఆరబెట్టారు. బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి కొద్దిమేర వరిధాన్యం తడిసింది. వర్షం పడే వాతావరణం నెలకొనడంతో అప్పటికే వరిధాన్యంను కుప్పలుగా పోసి, తడవకుండ తాడ్పాలు కప్పారు. మార్కెట్‌ ఆవరణలో రై తులు తీసుకువచ్చిన వరిధాన్యంను బాదేపల్లి సింగిల్‌విండో అధ్యక్షులు సుదర్శన్‌గౌడ్‌, డైరెక్టర్‌లు పరిశీలించారు. 


ఈదురు గాలులతో వర్షం

నారాయణపేట: నారాయణ పేటలో బుధవారం సాయం త్రం భారీ ఈదురు గాలులు వీచాయి. ఆకాశంలో ఉరు ములు మెరుపుల శబ్ధం రా వడంతో ప్రజలు భయాందో ళనలకు గురయ్యారు. ఓ మోస్తారు వర్షం కురిసింది. కొత్త గంజిలో 7వేల పైచిలు కు  ధాన్యం బస్తాలు ఉండడం తో ఆకస్మత్తుగా మెఘావృత్తంతో వ ర్షం కురవడంతో రైతులు ధాన్యం పా డవకుండా ఉండేందుకు పరుగులు తీశా రు. కొన్నీ వరి ధాన్యం సంచులు తడిచి పోయా యి. రైతులు తమ వరి కుప్పలపై కవర్లు కప్పగా కొంద రి ధాన్యం తడవడంతో ఆందోళనకు గురయ్యారు. కోస్గి, మక్తల్‌లో ను వర్షం కురియగా ధన్వాడ, ఊట్కూర్‌, మద్దూర్‌, కృష్ణ మండల కేంద్రాల్లో ఈదురు గాలులతో మెఘా వృత్తమైంది. 


ఉరుములు..మెరుపులు

మహబూబ్‌నగర్‌: పాలమూరులో సాయంత్రం అయిందంటే ఉరుము లు..మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కూడా సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులతో మోస్తారు వ ర్షం కురిసింది. పట్టణంలో బలమైన గా లులు వీయడంతో విద్యుత్‌ సరఫరా ని లిచిపోయింది.. నవాబ్‌పేట మండ లం, హన్వాడ, భూత్పూర్‌ మండలా ల్లోనూ తేలికపాటి జల్లులు కురిశా యి. ప్రస్తుతం వరిపంట చాలావరకు  కోత దశలో ఉన్నందున ఉరుములు, మెరుపులకు అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. వడగండ్ల వాన కురిస్తే పెద్దఎత్తున పంటనష్ఠం జరిగే అవకాశం ఉంది. అయితే వర్షాలు కురవకపోవడం వల్ల రైతులు  ఊపిరి పీల్చుకున్నారు.



Updated Date - 2021-05-06T05:06:55+05:30 IST