‘ప్రశ్నించే గొంతుక ప్రొఫెసర్ నాగేశ్వర్’
ABN , First Publish Date - 2021-02-27T05:06:13+05:30 IST
అపర మేధావి ప్రశ్నించే గొంతుక ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను గెలిపించాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ అన్నారు.

నారాయణపేట, ఫిబ్రవరి 26 : అపర మేధావి ప్రశ్నించే గొంతుక ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను గెలిపించాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన ప్రజా సం ఘాల జిల్లా నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మా ట్లాడారు. రైతు, కార్మిక, ఉద్యోగ, నిరుద్యోగ, విద్యార్థి, యువజ న సమస్యలు పరిష్కరించాలని పోరాడే వ్యక్తి నాగేశ్వర్ అని అన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంక ట్రామ్‌రెడ్డి, కార్యదర్శి బాల్‌రామ్, కార్మిక సంఘం బాలప్ప, గోపాల్, రైతు సంఘం అంజిలయ్య గౌడ్, డీవైఎఫ్‌ఐ మహ మ్మద్ అలీ, కాశప్ప, నరహరి, భీంసేన్, కృష్ణయ్య పాల్గొన్నారు.