ఘనంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ పుర స్కారాలు

ABN , First Publish Date - 2021-11-24T04:51:54+05:30 IST

కేంద్ర ప్రభు త్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ఉమ్మడి జిల్లాలోనే ఆత్మకూర్‌ మునిసిపాలిటీ మొదటి స్థానం కైవసం చేసుకున్నదని ముని సిపల్‌ కమిషనర్‌ రమేష్‌ తెలిపారు.

ఘనంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ పుర స్కారాలు
మునిసిపల్‌ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులను సన్మానిస్తున్న పాలకమండలి

ఆత్మకూర్‌, నవంబరు 23 : కేంద్ర ప్రభు త్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా ఉమ్మడి జిల్లాలోనే ఆత్మకూర్‌ మునిసిపాలిటీ మొదటి స్థానం కైవసం చేసుకున్నదని ముని సిపల్‌ కమిషనర్‌ రమేష్‌ తెలిపారు. ఈ సం దర్భంగా ఆత్మకూర్‌ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచిన పారిశుధ్య కార్మికులను మంగళవా రం మునిసిపల్‌ కార్యాలయంలో  చైర్‌ పర్సన్‌ గాయత్రి, వైస్‌చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి ఘ నంగా సన్మానించారు. ఈ సందర్భంగా గాయ త్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించి న స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమంలో ఆత్మకూర్‌ మునిసిపల్‌ కేంద్రం జాతీయ స్థాయిలో 17వ స్థానం, ఉమ్మడి జిల్లాలో మొదటి స్థానం కైవ సం చేసుకుందని తెలిపారు. పట్టణంలోని కాలనీలను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశు ధ్య కార్మికుల శ్రమ ఎంతో ఉందని తెలిపారు.  ఇలాంటి సేవాభావాన్ని మున్ముందు కూడా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌, కౌన్సిలర్లు చెన్నయ్య, పోషన్న, అశ్విని కుమార్‌, రామకృష్ణ, యాదమ్మ, మహే శ్వరి, నాగలక్ష్మిరెడ్డి, తబస్సుమ్‌ బేగం, పారి శుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-24T04:51:54+05:30 IST