పక్కా భవనాలేవీ?

ABN , First Publish Date - 2021-07-12T05:30:00+05:30 IST

నియోజకవర్గంలో ఏళ్ల తర బడి ప్రభుత్వ కార్యాలయాలు పక్కా భవనాలకు నోచుకోక పోవడం శోచనీయం.

పక్కా భవనాలేవీ?
అద్దె భవనంలో ఎక్సైజ్‌ కార్యాలయం

- అద్దె భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు

- భవనాల నిర్మాణం చేపట్టినా ప్రారంభం కాని వైనం


అచ్చంపేట టౌన్‌, జూలై 12: నియోజకవర్గంలో ఏళ్ల తర బడి ప్రభుత్వ కార్యాలయాలు పక్కా భవనాలకు నోచుకోక పోవడం శోచనీయం. అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వ కా ర్యాలయాలు  అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. ఎకైజ్‌ శాఖ కార్యాలయం, సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలు, లేబర్‌ కార్యాలయం, బీసీ రెసిడెన్సియ ల్‌ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్ర సబ్‌ సెంటర్లు అద్దె భవనంలో కొనసాగుతూ రూ.లక్షల్లో అద్దెలు చె ల్లిస్తున్నారు. ఎక్సైజ్‌ శాఖ కార్యాలయానికి నిధులు మం జూరై భవన నిర్మాణాలు ప్రారంభమైనా కార్యరూపం దాల్చ కపోవడం విచారకరం. ప్రభుత్వానికి ఆదాయ వనరులు స మకూర్చుతున్న ఎక్సై.జ్‌ శాఖ భవనం ఇంకా పూర్తి స్థాయిలో  ని ర్మించుకోకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎక్సై జ్‌ కార్యాలయానికి అధికారులు కనీసం  కనిపించేలా బోర్డు ఏర్పాటు చేయడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు సంవత్సరాల తరబడి అద్దె భవనాల్లోనే కార్యకలాపాలు ని ర్వహిస్తున్నారు. సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయాన్ని ఇప్పటికీ పట్ట ణంలో ప్రభుత్వ స్థలం లేకపోవడంతో ఇరుకు గదుల్లోనే కాలం వెల్లదీస్తున్నారు. దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అచ్చంపేట మునిసిపాలిటీలో వ్యవసాయ భూములను ప్లాంట్‌గా మార్చి అనుమతులు లేకుండానే రియల్‌ వ్యాపా రులు విక్రయిస్తున్నారు. ఒకరు ఇద్దరు మాత్రమే ప్లాంట్ల విక్రయానికి మునిసిపల్‌ అనుమతులు తీసుకుంటున్నారు. సరైన అనుమతులు తీసుకుంటే మునిసిపల్‌ కార్యాలయా నికి 10శాతం భూమిని కేటాయించాల్సి ఉండగా డబ్బుల రూపంలో అధికారులు దండుకుంటున్నారు. అద్దె భూమిని కేటాయిస్తే ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు స్థలాల ఇ బ్బందులు లేకుండా నిర్మాణాలు కొనసాగుతాయని పలువు రు అభ్రిప్రాయపడుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారు లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వెంటనే  నియోజకవర్గ కేంద్రమైన అచ్చంపేటలో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మానం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.



Updated Date - 2021-07-12T05:30:00+05:30 IST