మెరుగైన వైద్యసేవలు అందించాలి: డీఎంఅండ్‌హెచ్‌వో
ABN , First Publish Date - 2021-02-02T04:07:12+05:30 IST
ఏజెన్సీ ప్రాంతంలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంఅండ్‌హెచ్‌వో సుధాకర్‌లాల్ అన్నారు.

అచ్చంపేటఅర్బన్, ఫిబ్రవరి 1: ఏజెన్సీ ప్రాంతంలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంఅండ్‌హెచ్‌వో సుధాకర్‌లాల్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలోని సిద్దాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు వైద్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో బెడ్లు సరిగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని డాక్టర్ చందూలాల్‌ను ఆదేశించారు. సిద్దాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో త్వరలోనే రెగ్యులర్ డాక్టర్లను నియమిస్తామన్నారు. రెండోరోజు పల్స్‌పోలియో కార్యక్రమాన్ని పరిశీలించారు. మంగళవారం వరకు పూర్తిస్థాయిలో 100 శాతం చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని సంబంధిత ఏఎన్‌లను ఆదే శించారు. మండలంలోని ఘణపూర్, సిద్దాపూర్, మన్నెవారిపల్లి, అక్కారం, బక్కలింగాయపల్లి గ్రామాలలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని పరిశీలించారు. వైద్యులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్నారుల పోలియో నమోదును పరిశీలించారు. ఆయనతో పాటు డిప్యూటీ డీఎంఅండ్ హెచ్‌వో శ్రీధర్, వైద్యసిబ్బంది ఉన్నారు.
లక్ష్మాపూర్‌లో
పదర: పదర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని లక్ష్మాపూర్‌లో జిల్లా వైద్యాధి కారి సుధాకర్‌లాల్ సోమవారం ఆకస్మిక పర్యటన చేపట్టారు. వైద్య సిబ్బంది పనితీ రు బాగుందని చెప్పడంతో బృందాన్ని అభినందించారు. పదర పీహెచ్‌సీ డాక్టర్ గౌత మ్, సిబ్బంది అశోక్‌ప్రసాద్, మురళి పాల్గొన్నారు.
పరిశీలించిన అదనపు వైద్యాధికారి
తిమ్మాజిపేట: జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ వెంకటదాసు సోమవారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించారు. మండల పరిధిలోని గుమ్మకొండ గ్రామ సమీపంలో పొలానికి వెళుతున్న ఓ మహిళ ఎత్తుకున్న బాలుడి చిటికన వేలును ఆయన పరిశీలించారు. ఆయన వెంట మండల వైద్యాధికారి డాక్టర్ మంజులవాణి, ఫార్మాసిస్ట్ బాల్‌రాజ్, సూపర్‌వైజర్లు గౌస్, సురేందర్‌రెడ్డి ఉన్నారు.