ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

ABN , First Publish Date - 2021-11-10T05:22:10+05:30 IST

జిల్లా వ్యాప్తంగా తగినన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి డిమాండ్‌ చేశారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
గద్వాల పాత బస్టాండు చౌరస్తాలో నిరసన తెలుపుతున్న నాయకులు

- సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నిరసన

- రైతులను ఆదుకోవాలని డిమాండ్‌

- జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు

గద్వాల టౌన్‌/ వడ్డేపల్లి/ ఉండవల్లి/ గట్టు, నవంబరు 9 : జిల్లా వ్యాప్తంగా తగినన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం విమర్శలు చేసు కోవడం మాని రైతులను ఆదుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ పట్టణంలోని పాతబస్డాండ్‌ చౌరస్తాలో మంగళవారం వారు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయవద్దని కేంద్ర జారీ చేసిన సర్క్యుల ర్‌పై సకాలంలో స్పందించని రాష్ట్ర ప్రభుత్వం, ఉప ఎన్నిక అనంతరం విమర్శలకు దిగడం అవకాశవాద మన్నారు. గత ఏడాది ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్‌, రబీ సీజన్లలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఐకేపీ, పీఏసీఎస్‌, ఏఎం సీల ద్వారా తగినన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాల న్నారు. గోనెసంచుల కొరత లేకుండా చూడాలని కోరారు. ధాన్యాన్ని ఏరోజుకారోజు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బు జమ చేయాలని డిమాండ్‌ చేశారు. తరుగు, తేమ పేరుతో కోతలు విధించొద్దని చెప్పారు. కార్య క్రమంలో ఉప్పేరు నరసింహ, ఆంజనేయులు, నరసిం హ, రామకృష్ణ, కళ్యాణ్‌, హమాలీ సంఘం నాయకులు నరేష్‌, పరశురాముడు, లక్ష్మన్న, చంద్రమోహన్‌, మహే ష్‌, రాంబాబు, ఆనంద్‌, విష్ణు, షబ్బీర్‌ పాల్గొన్నారు. 


- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై సీపీఎం ఆధ్వర్యంలో వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లోని అంబేడ్కర్‌ సెంటర్‌లో మంగళవారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ఏ పరంజ్యోతి, సీఐటీయూ నాయకులు నరసింహ, నాగరాజు, మనీ రాజు, మహేష్‌ పాల్గొన్నారు. 


- ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచాలని సీపీఎం ఉండవల్లి మండల నాయకులు వెంకటేశ్వర్లు, రాజు, తదితరులు తహసీల్దార్‌ వీరభద్రయ్యకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకుడు పరశురాముడు తదితరులు పాల్గొన్నారు. 


- ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని గట్టు, గొర్లఖాన్‌దొడ్డి, మాచర్ల, బల్గెర గ్రామాల్లో సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందచేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకుడు వీవీ నర్సింహ, నాయకులు ఆంజనేయు లు, దుల్లయ్య, వెంకటేష్‌, బజారన్న, స్వామి, వీరన్న, ఉరుకుందు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-10T05:22:10+05:30 IST