ప్రాజెక్టు కావాలి.. పరిహారం దక్కాలి

ABN , First Publish Date - 2021-08-11T04:53:35+05:30 IST

‘బీడు బారిన మా పొలాల్లో కృష్ణమ్మ పరుగులు పెట్టాలి..

ప్రాజెక్టు కావాలి.. పరిహారం దక్కాలి
హన్వాడలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకట్రావు

- పీఆర్‌ఎల్‌ఐ రెండో దశ పనులపై ప్రజాభిప్రాయం

- పర్యావరణానికి ముప్పు లేదని అందరి ఏకాభిప్రాయం

- ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన కార్యక్రమం


మహబూబ్‌నగర్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/నారాయణపేట టౌన్‌/వెల్దండ , ఆగస్టు 10 : ‘బీడు బారిన మా పొలాల్లో కృష్ణమ్మ పరుగులు పెట్టాలి.. అందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్‌ఎల్‌ఐ) ద్వారా సాగునీటిని అందించాలి.. అదే సమయంలో మా త్యాగాలను గుర్తించాలి.. పథకం కింద ముంపునకు గురైన తమ పొలాలకు న్యాయమైన పరిహారం అందించాలి.. పథకం ప్రారంభ సమయంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి..’ అని ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు తమ గళాన్ని వినిపించారు.. పీఆర్‌ఎల్‌ఐ కింద రెండో దశలో చేపట్టనున్న కెనాల్‌ నెట్‌వర్క్‌ పనులకు పర్యావరణ అనుమతుల నిమిత్తం మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది.. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ, నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ, నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమాలకు ఆయా జిల్లాల కలెక్టర్లు అధ్యక్షత వహించారు.. రైతులు, రైతు సంఘాల నాయకులు, అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, రిటైర్ట్‌ ఇంజనీర్లు, పర్యావరణ పరిరక్షణ అధికారులు పాల్గొని, తమ వాదనలు వినిపించారు..

మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడలోని ఎంపీపీ కార్యాలయ ఆవరణలో కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు అధ్యక్షతన మంగళవారం పీఆర్‌ఎల్‌ఐ రెండో దశ పనులపై ప్ర జాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాజెక్టుతో ఏర్పడే పర్యావర ణ ప్రభావం పరిస్థితిపై సర్వే నిర్వహించిన హర్యానాకు చెందిన వోయంట్స్‌ సొ ల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధి సమాతిక మిశ్రా నివేదికను సమ ర్పించారు. పథకం కింద చేపట్టే పనులతో పర్యావరణానికి ఎలాంటి హానీ జరగ దని, భవిష్యత్‌లో నీటి వనరులు పెరగడం ద్వారా సమతుల్యత జరుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం పీఆర్‌ఎల్‌ఐ ఎస్‌ఈ నరసింగ రావు పథకం ఉద్దేశ్యాన్ని వివరించారు. పర్యావరణ మండలి ఈఈ ఎం.దయా నంద్‌, అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్‌నంద లాల్‌ పవార్‌, ఆర్డీవో పద్మ శ్రీ పాల్గొనగా, రైతులు, రిటైర్డ్‌ ఇంజనీర్లు, రైతు కూలీ సంఘాల ప్రతినిధులు, ప ర్యావరణ సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. వచ్చిన అ భిప్రాయాల్లో కరువు పీడిత ప్రాంతాలను సస్యశ్యామలం చేసే ఈ పథకం పను లు వేగిరంగా చేపట్టి, ఆయకట్టుకు సాగునీరిందాలని డిమాండ్‌ చేశారు. నిర్వా సితులయ్యే రైతులకు మెరుగైన పరిహారమివ్వాలనే డిమాండ్లు వచ్చాయి. కాల్వ లకు ఇరువైపులా మొక్కలు నాటాలని, వృక్షజాతుల పెంపకానికి చర్యలు తీసుకో వాలని సూచిస్తూ పర్యావరణ సంస్థలు లిఖిత పూర్వకంగా కోరాయి. కాల్వలకు ఇరువైపులా పశువులు కూడా దిగేందుకు వీలుగా మెట్లు నిర్మించాలని దివ్యాంగు ల సంక్షేమ సంఘం నాయకులు లిఖితపూర్వకంగా విన్నవించారు. 

నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ సమీపంలోని ఏవీఆర్‌ గార్డెన్‌లో పీఆర్‌ఎల్‌ఐ రెండో దశ పనులపై జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి క లెక్టర్‌ ఎల్‌పీ శర్మన్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్‌ సంగీతలక్ష్మి ప్రాజెక్టు ఆవశ్యకత, ఖర్చు, పర్యావరణంపై వివరించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ మాట్లాడుతూ పీఆర్‌ఎల్‌ఐ ఈ ప్రాంత ప్రజల చిరకాలవాంచగా అభివర్ణించారు. జడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలాజీసింగ్‌ మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. అలాగే జడ్పీటీసీలు విజితారెడ్డి, భరత్‌కుమార్‌, కల్వకుర్తి మునిసిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం ప్రాజెక్టుతో ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జాయింట్‌ చీఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ కృపానంద్‌, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఈ విజయబాస్కర్‌రెడ్డి, ఈఈ హన్మంతరెడ్డి పాల్గొన్నారు.

నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంజనా గార్డెన్‌లో మంగళవారం పీఆర్‌ ఎల్‌ఐపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప ర్యావరణ శాఖ అధికారి కుమార్‌పాటిల్‌, నీటి పారుదల శాఖ అధికారి దయా నంద్‌, కలెక్టర్‌ హరిచందన దాసరి, అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, ఆర్డీవో వెం కటే శ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు పీఆర్‌ఎల్‌ఐ గురించి వివరించా రు. అయితే, ప్రజాభిప్రాయ సేకరణలో ఎక్కువ మొత్తంలో రైతుల పేర్లు నమో దు చేసుకోవడంతో కలెక్టర్‌ డిప్‌ ద్వారా పేర్లను తీసి వారి అభిప్రాయాలను రికా ర్డు చేశారు. చాలా మంది రైతులు ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, జీవో 69 ప్రకారం సాగునీరు ఇవ్వాలని కొందరు డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులు వారిని సమావేశం నుం చి బయటకు పంపించారు. కాగా, దామరగిద్ద మండలంలో కేవలం 16 గ్రామా లకే సాగునీటిని అందంచేలా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారని, మండలం లోని కాన్‌కూర్తి వద్ద రెండు టీఎంసీల రిజర్వాయర్‌ నిర్మిస్తే మిగతా గ్రామాలకు కూడా సాగునీరు అందుతుందని దామరగిద్ద, మద్దూర్‌ మండలాల రైతులు అ భిప్రాయం వ్యక్తం చేశారు. ధన్వాడ మండలం ఎల్లిగండ్ల గ్రామానికి చెందిన రై తు హన్మంతు మాట్లాడుతూ కెనాల్‌ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న పొ లం యజమాని పేరు మాత్రమే రాసి, అతనికే పరిహారం ఇవ్వాలని కోరారు. రె వెన్యూ అదికారులు పక్క పొలం యజమాని పేర్లు కూడా రాసి వారికి కూడా పరిహారమందించేలా చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ప్రాజెక్టు కెనాల్‌ ద్వారా చెరువులను నింపాలని మరికొందరు రైతులు కోరారు.


కనిపించని రైతులు

కల్వకుర్తిలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు కనిపించలేదు. ఈ కార్యక్రమంపై రైతులకు అధికారులు ఎలాంటి సమాచారం అందించలేదు. కార్యక్రమంలో మొత్తం ప్రజాప్రతినిధులే దర్శనమిచ్చారు. కొన్ని కుర్చీలలో స్థానికంగా ఉన్న ఉపాధిహామీ కూలీలు కనిపించారు. మొత్తంగా రైతులకంటే ప్రజాప్రతినిధులే పథకంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.


భారీగా పోలీసు బందోబస్తు

అభిప్రాయ సేకరణ నిర్వహించిన అన్ని ప్రాంతాల్లో పోలీసులు భారీ బం దోబస్తును ఏర్పాటు చేశారు. హన్వాడలో ఏర్పాటు చేసిన బందోబస్తును ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. ప్రజాభిప్రాయ సేకరణ వేదికకు అర కి లోమీటర్‌ దూరం నుంచే వాహనాల త నిఖీలు నిర్వహించారు. అలాగే కల్వకు ర్తిలో భారీగా పోలీసులను మోహరించారు. ముగ్గురు డీఎస్పీలు, ఎనమిది మంది సీఐలు, ఎస్‌ఐలు, ప్రొబెషనరీ ఎస్‌ఐలతో కలిపి దాదాపు 200 మంది పోలీసులు కట్టుదిట్టమైన కల్పించారు. వేదిక వద్ద కూడా చాలా మంది మఫ్టీలో పోలీసులు కూర్చున్నారు.


ఏకపక్షంగా ప్రజాభిప్రాయ సేకరణ

ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నారాయణపేటలో ఏకపక్షంగా జరి గిందని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామ్‌రెడ్డి ఆరోపించారు. కార్యక్రమం లో తమ వాణిని వినిపిస్తుంటే పోలీసులు బలవంతంగా తమకు బయటకు తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 40 కిలోమీటర్లు ప్రవహిస్తు న్న కృష్ణా నీటిని అందించేందుకు జీవో 69 అమలు చేయాలని డిమాండ్‌ చే శారు. పథకానికి తాము వ్యతిరేకం కాదని, రైతుల అభిప్రాయాలను సేకరిం చకుండా అధికార పార్టీ నాయకుల అభిప్రాయాలను తీసుకోవడం సమంజ సం కాదని అన్నారు. బీకేఎస్‌ జిల్లా అధ్యక్షుడు వెంకోబా మాట్లాడుతూ ముం దుగా జీవో 69 ద్వారా ఈ ప్రాంతానికి సాగునీటిని అందించి, ఆ తర్వాత పీ ఆర్‌ఎల్‌ఐ ద్వారా నీటిని తీసుకు వచ్చిన తమకు ఎలాంటి అభ్యంతరం లేద న్నారు. నిరసనలో రఘువీర్‌ యాదవ్‌, గోపాల్‌, అంజిలయ్య, మహేష్‌, అనం త్‌రెడ్డి, ప్రశాంత్‌, సాయి పాల్గొన్నారు.



Updated Date - 2021-08-11T04:53:35+05:30 IST