ఉపాధ్యాయుల పదోన్నతులకు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2021-02-07T03:22:13+05:30 IST

ఉపాధ్యాయుల పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దాంతో విద్యాశాఖ ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 200లకుపైగా గజిటెడ్‌ ప్రధనోపాధ్యాయ పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ కానున్నయి.

ఉపాధ్యాయుల పదోన్నతులకు రంగం సిద్ధం

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం జనవరి 6: ఉపాధ్యాయుల పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దాంతో విద్యాశాఖ ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 200లకుపైగా గజిటెడ్‌ ప్రధనోపాధ్యాయ పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ కానున్నయి. అర్హత గల స్కూల్‌ అసిస్టెంట్‌లకు సీనియారిటీ ప్రకారం పదోన్నతులు లంభించనున్నాయి. ప్రభుత్వ లోకల్‌ బాడీ, ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న గజిటెడ్‌ హెచ్‌ఎంల పోస్టులు భర్తీ చేయనున్నారు. అదేవిదంగా 1,500లకు పైగా  సెకండరీ గ్రేడ్‌ టీచర్లు స్కూల్‌ అసిస్టెంట్స్‌గా పదోన్నతి పొందనున్నట్లు తెలుస్తోంది. దాంతో ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులకు సంబంధించి స్కూల్‌ అసిస్టెంట్‌, జీహెచ్‌ఎం, డైట్‌ అధ్యాపకులు, బీఎడ్‌ అధ్యాపకులు, మండల విద్యాశాఖ అఽధికారి పోస్టులన్నింటికీ పదోన్నతులు కల్పించాలని సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.


హర్షం

భాషా పండితులకు స్కూల్‌ అసిస్టెంట్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం శనివారం జీవో తేవడం పట్ల రాష్ట్రీయ పండిత పరిషత్‌ తెంగాణ రాష్ట్ర జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాకేష్‌, శ్రీరాములు ఒక ప్రకటనలో హర్షం వ్వక్తం చేశారు. ఇది చారిత్రక విజయమని అన్నా రు. ఉమ్మడి జిల్లాలో 1,205 మంది భాషా పండితులకు పదోన్నతి లభిస్తుందని తెలిపారు.

Updated Date - 2021-02-07T03:22:13+05:30 IST