పంట నమోదు విషయంలో జాగ్రత్తలు పాటించాలి

ABN , First Publish Date - 2021-08-22T04:44:45+05:30 IST

గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంటల నమోదు విషయంలో ఎక్కడా అవకతవకలు రానీయకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సుచరిత అధికారులకు సూచించారు.

పంట నమోదు విషయంలో జాగ్రత్తలు పాటించాలి
భూత్పూర్‌ గ్రామ శివారులో వ్యవసాయ అధికారులకు సూచనలు ఇస్తున్న జేడీఏ

- జిల్లా వ్యవసాయశాఖ అధికారి సుచరిత


భూత్పూర్‌, ఆగస్టు 21 : గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంటల నమోదు విషయంలో ఎక్కడా అవకతవకలు రానీయకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సుచరిత అధికారులకు సూచించారు. శనివారం భూత్పూర్‌ గ్రామ పరిధిలో వ్యవసాయశాఖ అధికా రులు నమోదు చేస్తున్న పంటల నమోదు ప్రక్రియ కార్యక్రమాన్ని ఆమే దేవరకద్ర ఏడీఏ యశ్వంత రావుతో కలిసి పరిశీలించారు. సెస్టెంబర్‌ 5వ తేదీలోపు పంటల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా రైతుబీమా దరఖాస్తుల ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని జేడీఏ ఆదేశించారు. ఈమే వెంట మండల వ్యవసాయశాఖ అధికారి మురళీధర్‌, విస్తరణ అధికారి హర్షవర్దన్‌, వీఆర్‌ఏ, రైతులు పాల్గొన్నారు.


భూసార పరీక్షలతో అధిక దిగుబడి


పాలమూరు, ఆగస్టు 21 : రైతులందరు తమ పొలంలో భూసార పరీక్షలు చేయించడం వల్ల అధికదిగుబడి పొందవచ్చని మహబూబ్‌నగర్‌ ఏడీఏ బి.వెంకటేష్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఏడీఏ కార్యాలయంలో పలువురు రైతులకు యూరియా, పొటాష్‌, జింక్‌, బయోపత్తిలను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్బన్‌, రూరల్‌ ఏఓలు శ్యాంయాదవ్‌, ఇస్రత్‌సుల్తానా, ఏఈఓలు సునీత, అన్వర్‌, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-22T04:44:45+05:30 IST