పెన్షన్లు మంజూరు చేయాలి

ABN , First Publish Date - 2021-07-13T05:06:20+05:30 IST

పెన్షన్లు మంజూరు చేసి తమను ఆదుకోవాలని పలువురు బాధితులు ప్రజవాణిలో కలెక్టర్‌ శ్రుతి ఓఝాకు విజ్ఞప్తి చేశారు.

పెన్షన్లు మంజూరు చేయాలి
బాధితుడితో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రుతి ఓఝా

- సీడ్‌పత్తి రైతులకు పరిహారం అందించాలి

- కలెక్టర్‌ శ్రుతి ఓఝాకు బాధితుల విజ్ఞప్తి

- ప్రజావాణికి 100 ఫిర్యాదులు

గద్వాల క్రైం, జూలై 12 : పెన్షన్లు మంజూరు చేసి తమను ఆదుకోవాలని పలువురు బాధితులు ప్రజవాణిలో కలెక్టర్‌ శ్రుతి ఓఝాకు విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ఫిర్యాదులు, దర ఖాస్తులను స్వీకరించి బాధితులతో మాట్లాడి సమ స్యలను తెలుసుకున్నారు. ప్రజావాణికి 100 ఫిర్యా దులు రాగా వాటిని సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ పేర్కొన్నారు. 


- గద్వాల పట్టణం బీసీ కాలనీకి చెందిన లక్ష్మి భర్త కొన్ని నెలల క్రితం మృతి చెందాడు. వితంతు పెన్షన్‌ కోసం మున్సిపల్‌ కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదని, వెంటనే పెన్సన్‌ మంజూరు చేయాలని వేడుకున్నారు. పట్టణంలోని ఒంటెలపేట కాలనీకి చెందిన ఒంటరి మహిళ నాగమ్మ కూడా పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 


- సీడ్‌పత్తి కంపెనీలు, ఆర్గనైజర్ల మోసాలతో రైతులు ఆర్ధికంగా నష్టపోయారని, పరిహారం కోసం కోర్టులను ఆశ్రయించగా పక్షం రోజుల్లో అంచనా వేసి నష్టపరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇప్పటివరకు ఇవ్వలేదని, వెంటనే ఇచ్చేలా చూడాలని రైతులు రామిరెడ్డి, కృష్టయ్య, నరసింహులు, నాగరాజు, దేవదాసు ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చారు.


బిహార్‌ ఎన్నికల అధికారులకు ఈవీఎంల అందజేత

గద్వాల క్రైం, జూలై 12 : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎంలను పరిశీలించి బిహార్‌ నుంచి వచ్చిన ఎన్నికల అధికారులకు అందించినట్లు కలెక్టర్‌ శ్రుతి ఓఝా అన్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని పీజేపీ క్యాంపు ఆవరణలో సీల్‌ చేసి ఉన్న స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలను సోమవారం తెరిచి ఈవీఎంలు, కంట్రోల్‌ యూనిట్‌, బ్యాలెట్‌ యూనిట్‌, వీవీ ప్యాట్‌లను పరీక్షించి, బిహార్‌ రాష్ట్ర ఎన్నికల అధికారులకు అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రఘురామ్‌శర్మ, ఆర్డీవో రాములు, సెక్షన్‌ అధికారి జయలక్ష్మి, బీహార్‌ అధికారులు నిరంజన్‌ కుమార్‌, రమేష్‌కుమార్‌, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-13T05:06:20+05:30 IST