కరెంటు చిచ్చు

ABN , First Publish Date - 2021-03-23T04:20:08+05:30 IST

గద్వాల ఎస్సీ కార్పొరేషన్‌, ట్రాన్స్‌ కో మధ్య వార్‌ కొనసాగుతోంది.

కరెంటు చిచ్చు
విద్యుత్‌ కనెక్షన్లను రెగ్యులర్‌ చేసుకోవాలని ఎస్సీ కాలనీలో కౌన్సిలింగ్‌ చేస్తున్న ట్రాన్స్‌కో అధికారులు

ఎస్సీ కార్పొరేషన్‌ వర్సెస్‌ ట్రాన్స్‌కో 

ఉచితం ముసుగులో భారీ వినియోగం 

అక్రమ కనెక్షన్లు రెగ్యులరైజ్‌  చేసుకోవాలని ఎస్సీ కుటుంబాలపై ఒత్తిడి 

ఎస్సీ సర్టిఫికెట్‌, ఆధార్‌  ఇవ్వని పలువురు వినియోగదారులు

కలెక్టర్‌, సీఎండీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు

గద్వాల, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): గద్వాల ఎస్సీ కార్పొరేషన్‌, ట్రాన్స్‌ కో మధ్య వార్‌ కొనసాగుతోంది. ఎస్సీ కాలనీల్లోని గృహాలకు అక్రమంగా కొనసాగుతున్న విద్యుత్‌ కనెక్షన్లను రెగ్యులర్‌ చేసుకోవాలని ట్రాన్స్‌కో సిబ్బంది ఎస్సీ కుటుంబాలపై ఒత్తిడి తీసుకు వస్తున్నది.  ఉచిత విద్యుత్‌ అంటూ భారీగా కరెంటును ప్రజలు వినియోగించుకున్నారు. 101 యూనిట్ల వరకు మాత్రమే ఎస్సీ కార్పొరేషన్‌ బిల్లులు చెల్లిస్తుందని, అధికంగా వాడుకున్న విద్యుత్‌కు ఎస్సీల నుంచి వసూలు చేసుకోవాలని ఆ కార్పొరేషన్‌ స్పష్టం చేసింది. ఎవరైనా బిల్లులు కట్టాల్సిందేనని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. ఎస్సీ కాలనీల్లో గృహ వినియోగదారులు ఎస్సీ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు ఇవ్వకుండా  విద్యుత్తును వాడుకోవడం వినియోగం పెరిగింది. ఈ భారాన్ని ట్రాన్స్‌కో ఇతరులపై సైతం మోపు తుంది. బకాయిలు చెల్లించాలంటూ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి విద్యుత్‌ సర ఫరాను నిలిపేస్తున్నారు.   గద్వాల పట్టణంలో గంజిపేట, అయిజ పట్టణంలో ఎస్సీ కాలనీలో ఇదే విషయంపై వాగ్వాదం సైతం జరిగింది.  ఎస్సీలకు ప్రభుత్వం ఉచిత కరెంటు ఇస్తుంటే బిల్లులు కట్టమని ఒత్తిడి తీసుకురావడం ఏమిటని ఎస్సీ కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. 

    ట్రాన్స్‌కో ఉద్యోగుల్లో ఆందోళన 

ఎస్సీలకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని ఆదేశాలున్నా అధికారులు సరఫరా చేయడం లేదని గద్వాల, అలంపూర్‌ ఎమ్మెల్యేలు కలెక్టర్‌ శ్రుతి ఓఝాకు ఇటీవలే ఫిర్యాదు చేశారు.  ఈ నెల 17న ట్రాన్స్‌కో సీఎండీని అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహాం కలిశారు. అక్కడ ఎమ్మెల్యే, సీఎండీ మధ్య ఏమి జరిగిందో తెలియదు. జిల్లాలో ఎనిమిది మంది ట్రాన్స్‌కో ఏఈలకు, ఏడీఏలకు, డీఈకి మెమోలు వచ్చాయి. దీంతో వారిలో భయాందోళనలు మొదలయ్యాయి.  ప్రమోషన్లు ఆగిపోయే పరిస్థితి ఉందని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రాకుండా పోయే అవకాశం ఉందని భయపడుతున్నారు. 

జిల్లాలో 35 వేల విద్యుత్‌ కనెక్షన్లు

 జిల్లాలో 35వేల గృహాల వరకు ఎస్సీల గృహాలు  ఉన్నాయి. వీటిలో కేవలం 10వేల కనెక్షన్ల మేర ఎస్సీ కుటుంబాలు  ఆధార్‌ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలిచ్చి రెగ్యులర్‌గా 101యూనిట్లు మాత్రమే కాల్చుకుంటున్నారు. మిగిలిన 25 వేల ఎస్సీ గృహ నివాసదారులు అక్రమంగా విద్యుత్‌ను వా డుకుంటున్నారన్నారు. అదనంగా 101 నుంచి 400 యూనిట్ల వరకు వాడుకుంటున్నారని ట్రాన్స్‌కో విచారణలో తేలింది. 

 ధ్రువీకరణ పత్రాలిస్తే  మీటర్‌ అమర్చుతాం

ఎస్సీలు ప్రభుత్వం అందించే ఉచి త విద్యుత్‌  అవకాశాన్ని పొందా లంటే ఎస్సీ ధ్రువీకరణ పత్రం, ఆధా ర్‌ కార్డ్‌ను కార్యాలయంలో సమర్పిం చాలి. వాటిని ఇస్తే వెంటనే ఉచిత మీటర్‌ అమర్చుతాం. 101 యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్‌ వాడితే మాత్రం వినియోగదారులు  బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. 

 చక్రపాణి, ఎస్‌ఈ ట్రాన్స్‌కో, గద్వాల Updated Date - 2021-03-23T04:20:08+05:30 IST