పేదల గుండె చప్పుడు.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-09-03T04:31:09+05:30 IST

దేశంలోని అనేక రా ష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేద ప్రజల గుండె చప్పుడని ఏఐసీసీ కార్యదర్శి, మా జీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు.

పేదల గుండె చప్పుడు.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి
వైఎస్సార్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

వనపర్తి టౌన్‌, సెప్టెంబర్‌ 2: దేశంలోని అనేక రా ష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేద ప్రజల గుండె చప్పుడని ఏఐసీసీ కార్యదర్శి, మా జీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు. గురువారం వైఎస్సార్‌ 12వ వర్ధంతిని సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యాల యంలో వైఎస్పార్‌ చిత్రపటానికి ఆయన పూలమా లలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రా నికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్సార్‌ దేశ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చే శాడని అన్నారు. ఆరోగ్యశ్రీ, 108, ఫీజురీయింబర్స్‌మెం ట్‌, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, ఉచిత కరెంట్‌, ఒక్క రూపాయికే కిలో బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, పేదలకు భూ పంపిణీ, మహిళా సంఘాలకు వడ్డిలే ని రుణాలు, సాగునీటి ప్రాజెక్టులు, ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులతో పాటు ఐటీ రంగాన్ని తీసుకొచ్చి నిరు ద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడని, ఇలా అనేక సంక్షేమ పథకాలకు ప్రాణం పోసిన మహానీ యుడు దివంగత వైఎస్సార్‌ అని ఆయన సేవలను కొనియాడారు.కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అ ధ్యక్షుడు శంకర్‌ప్రసాద్‌, టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌ గౌడ్‌, రాగి వేణు, అనీష్‌, కౌన్సిలర్‌ బ్రహ్మం, మాజీ కౌ న్సిలర్‌ సతీష్‌ యాదవ్‌,బాబా, వెంకటేష్‌, సురేష్‌గౌడ్‌, అబ్దుల్లా, గంధం లక్ష్మయ్య, వీణాచారి పాల్గొన్నారు. 

వైఎస్సార్‌టీపీ ఆధ్వర్యంలో..

తెలుగు రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజా నాయకుడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని వైఎస్సార్‌టీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మధులత అన్నారు. గురువారం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి సందర్బంగా పెద్దగూడెంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి  నివాళి అర్పించారు. అనంతరం జిల్లా ఆస్పత్రిలో రోగులకు బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు.  కార్యక్రమంలో వైఎస్సార్‌టీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌తోనే రాజన్న కల సాకారం 

కొత్తకోట : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే  దివం గత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కలలు సాకారం అవుతాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మేస్త్రీ శ్రీను అన్నారు. కొత్తకోటలో వైఎస్సార్‌ వర్ధంతిని గు రువారం  నిర్వహించారు.  వైఎస్సార్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమం లో కౌన్సిలర్‌ నాగన్న యాదవ్‌, కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, రవీం దర్‌రెడ్డి, శివరాములు, బాల్‌రెడ్డి, సలీంఖాన్‌, జేకే. ప్రసాద్‌, రాములు యాదవ్‌, ఇమ్రాన్‌ ఖాన్‌, ఇసాక్‌ తదితరులు పాల్గొన్నారు. 

మదనాపురంలో..

మదనాపురం : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.  కొన్నూరులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ హయాంలోనే ప్రాజెక్టుల నిర్మాణం, రుణమాిఫీ, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో కొన్నూరు గ్రామ సామాజిక వేత్త శరత్‌రెడ్డి, గ్రామ సర్పంచు సుక్క జగన్‌, రఘు నాథ్‌రెడ్డి, బాలకొండన్న, సతీష్‌రెడ్డి, మధుబాబు, అభిమన్యురెడ్డి, శివ రాఘవేంద్ర పాల్గొన్నారు.

పెద్దమందడిలో..

పెద్దమందడి : మండలంలోని మద్దిగట్లలో కాంగ్రె స్‌ పార్టీ నాయకులు దివంగత సీఎం వైఎస్‌ రాజ శేఖర్‌రెడ్డి వర్ధ్దంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన చిత్ర పటాని కి పూలమల వేసి నివాళి అర్పించారు. వైఎస్సార్‌ ఎం తో ముందు చూపుతో అప్పులు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని అయన సేవలు కొ నియాడారు.  ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రం లో ఎవరికి తెలియకుండా జీవోలను మాయం చేస్తూ ప్రజలపై పెనుభారం మోపుతోందని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ చెన్నకేశవులు,  కాంగ్రె స్‌ పార్టీ గ్రామ అధ్యక్షుడు గోవర్ధ్దన్‌గౌడ్‌,   శివారెడ్డి, ఆశన్న, కోట్ల కేశవులుగౌడ్‌, పంతుల శివారెడ్డి, ఆటో కృష్ణ, శేరిమీది నాగన్న, వడ్ల మోహన్‌ ఆచారి, రవి, శేఖర్‌, ముమాల శివకుమార్‌  పాల్గొన్నారు.

ఆత్మకూరులో.. 

ఆత్మకూరు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని వైఎస్‌ఆర్‌టీపీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. మక్తల్‌ నియో జ కవర్గ నాయకులు కర్ని గంగాధర్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు జబ్బార్‌, వెంకట న్న, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు. 

అమరచింతలో..

అమరచింత మండల కేంద్రంలో గురువారం దివంగత సీఎం  డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి ని జరుపుకున్నారు. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ నాయకులు సైకిల్‌ కురుమన్న, పెంటన్న ఆధ్వర్యంలో పట్టణంలోని కొత్త బస్టాండ్‌ సమీపంలో వైఎస్‌ఆర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం లో వైఎస్‌ఆర్‌ చేసిన ప్రజా సంక్షేమ పథకాలను బడుగు బలహీన వర్గాల గుండెల్లో గూడుకట్టుకున్నా యని తెలిపారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు కూడా ఆయనే శ్రీకారం చుట్టారని అన్నారు. కార్యక్రమంలో   వైఎస్‌ఆర్‌టీపీ కార్యకర్తలు మోష, కురుమూర్తి, సుబ్బు, అయ్యన్న, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-03T04:31:09+05:30 IST