ప్రతీ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలి
ABN , First Publish Date - 2021-07-09T05:25:05+05:30 IST
ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని అదనపు కలెక్టర్ సీతారా మారావు సూచించారు.

- హనుమాన్ స్ట్రీట్‌లో మొక్కలు పంపిణీ చేసిన అదనపు కలెక్టర్ సీతారామారావు
- పల్లెప్రగతిలోపాల్గొన్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
జడ్చర్ల, జూలై 8 : ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని అదనపు కలెక్టర్ సీతారా మారావు సూచించారు. జడ్చర్ల మునిసిపాలిటీలోని హనుమాన్ స్ర్టీట్‌లో గురువారం ప్రతీ ఇంటికి 6 మొ క్కలు అందజేసే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు పంపిణీ చేశారు. మొక్కలను కొనుగోలు చేసి, ఇంటిం టికి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో కౌన్సిలర్ పాలాది సారిక, కమిషనర్ సునీత, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్ నాయకులు పాలాది రామ్మోహన్, మచ్చల శ్రీను పాల్గొన్నారు.
మొక్కలు పంపిణీ చేసిన జడ్పీ సీఈవో
మండలంలోని మాటుబండతండా, గొల్లోనిదొడ్డి తండాలలో ఇంటింటి మొక్కలను జడ్పీ సీఈఓ జ్యోతి, ఎంపీడీవో స్వరూపలు పంపిణీ చేశారు.
అభివృద్ధికి కొదువలేదు : ఎమ్మెల్యే ఆల
అడ్డాకుల : తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు, గ్రామాల అభివృద్ధికి ఆటంకాలు లేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గురువారం మండలంలోని కందురు గ్రా మంలో హరితహారంలో మొక్కలు నాటారు. అనంత రం అదే గ్రామంలో 24గంటల పాటు నిరంతరం సర ఫరా అయ్యే విద్యుత్ లైన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావే శంలో ఆయన మాట్లాడారు. అనంతరం గ్రామానికి చెందిన 31మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథ కాల నుంచి మంజూరైన రూ. 45,05220 విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగార్జునరెడ్డి, జడ్పీటీసీ సభ్యు డు రాజశేఖర్‌రెడ్డి, సర్పంచ్ శ్రీకాంత్. ఎంపీటీసీ శ్యామ లమ్మ, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఖాజాఘోరీ, మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మహిమూద్, మండ ల రైతుబంధు అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో మంజు ల, ఏవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
జాతీయ రహదారి పక్కన మొక్కలు నాటిన ఎమ్మెల్యే
భూత్పూర్ : మండలంలోని తాటికొండ గ్రామ శివారులో 44వ జాతీయ రహదారి పక్కన హరితహా రంలో భాగంగా గురువారం ఫారెస్టు శాఖ అధికారు లతో కలిసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ బస్వరాజుగౌడ్, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, తాటికొండ గ్రామ ఎంపీటీసీ సాయిలు, ఉప సర్పంచ్ శ్రీనివాసు లు, భూత్పూర్ రామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ సభ్యుడు అశోక్‌గౌడ్, అటవీఅధికారులు పాల్గొన్నారు.
రుద్రారంలో పర్యటన
నవాబ్‌పేట : మండలంలోని అన్ని గ్రామాలలో ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని నవాబ్‌పేట జడ్పీ టీసీ రవీందర్‌రెడ్డి అన్నారు. గురువారం పల్లె ప్రగతి లో భాగంగా రుద్రారం గ్రామంలో గ్రామ సర్పంచ్ లలితమ్మతో కలిసి పర్యటించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ సంతోష్‌రెడ్డి, వెంకటేశ్వరెడ్డి, రైతుబంధు కన్వీనర్ కృష్ణగౌడ్, రుద్రారం రవి పాల్గొన్నారు.
ప్రగతి పనుల పరిశీలనకే పల్లె నిద్ర
రాజాపూర్ : గ్రామాల్లో ప్రస్తుతం జరుగుతున్న పల్లె ప్రగతి పనులను పరిశీలించడానికే గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నటు తహసీల్దార్ శంకర్ పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని నర్సిం గ్‌తండా, ఇబ్రహీంపల్లి గ్రామాల్లో పల్లెనిద్ర చే శారు. గ్రామంలో ప్రజలతో సమస్యలను అడిగి తెలు సుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌బన్ని, ఉప సర్పం చ్ మహిపాల్, గ్రామ వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి
మిడ్జిల్ : గ్రామంలోని ప్రతీ ఒక్కరు మొక్కలను నాటాలని సర్పంచ్ అక్తార్‌బేగం అన్నారు. గురువారం మండలంలోని కంచనపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల ఆవరణలో ఉపాధ్యాయులతో కలిసి సర్పంచ్ అక్తార్‌బేగం మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయభాస్కర్, అంగన్‌వాడీ కార్యకర్త లీలావతి, గ్రామస్థులు, విద్యార్థులున్నారు.
మైనారిటీ బాలుర పాఠశాలలో..
బాదేపల్లి : తెలంగాణ అల్పసంఖ్యాకుల బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ పాఠశాల, కళాశాలల సమన్వయ అధికారి మహ్మద్ జమీల్, జిల్లా విజిలెన్స్ అధికారి జమీర్‌ఖాన్, ప్రిన్సిపాళ్లు మేకల పారిజాత, కల్పన, సిబ్బంది పాల్గొన్నారు.
ఎట్టకేలకు వెన్నెల తండాలో హరితహారం
మహమ్మదాబాద్ : మండల పరిధిలోని ముందలి తండా గ్రామ పంచాయతీ పరిధిలోగల వెన్నెలతం డాలో సమస్యలు పరిష్కరించాకే హరితహారం చేప ట్టాలని గ్రామస్థులు ఆందోళన చేశారు. గ్రామ సర్పం చ్ నీల్యా, అధికారులు గ్రామస్తులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో అం దుకు గ్రామస్థులు ఒప్పుకున్నారు. దీంతో గురువారం తండాలో సర్పంచ్‌తో కలిసి గ్రామస్థులు రోడ్డుకు ఇరవైపులా మొక్కలు నాటారు.
లింబ్యాతండాలో అఽధికారుల పల్లె నిద్ర
మిడ్జిల్ : మండలంలోని లింబ్యాతండా గ్రామ పంచాయతీలో బుధవారం రాత్రి ఎంపీడీవో సాయిలక్ష్మీ, ఎంపీవో అనురాధతో పాటు పలువురు అధికారులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేఘన , గ్రామస్థులు ఉన్నారు.
