రహదారుల వెంట విధిగా మొక్కలు నాటాలి

ABN , First Publish Date - 2021-09-04T04:07:40+05:30 IST

హరితహారంలో భాగంగా రహదారి పొడవునా రెండు వైపులా ఖాళీ లు లేకుండా మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ పంచాయతీ రాజ్‌ అధికారులను ఆదేశించారు.

రహదారుల వెంట విధిగా మొక్కలు నాటాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

- కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): హరితహారంలో భాగంగా రహదారి పొడవునా రెండు వైపులా ఖాళీ లు లేకుండా మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ పంచాయతీ రాజ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం ఎస్‌జేఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో చేపట్టిన వివిధ పథకాలపై అదనపు కలెక్టర్‌ మనూచౌదరితో కలిసి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఉపాధి హామీ ద్వారా సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మా ణం, పల్లె ప్రకృతి వనాలు, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, హరితహారం వంటి కార్యక్రమాలు దాదాపుగా విజయవం తం చేసినట్లు తెలిపారు. గ్రామ పంచాయతీల్లో తడి చెత్తతో వర్మీ కంపోస్టు తయారు చేయించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనుల్లో అనుకున్న మేరకు పురోగతి లేదని తేడా కనిపించకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అన్ని ఉపాధి హా మీ పోస్టాఫీసు ఖాతాలను బ్యాంకు ఖాతాలుగా మార్చాలని ఆదేశించారు. కార్యక్ర మంలో డీపీవో రాజేశ్వరి, పీడీ డీఆర్డీఏ నర్సింగ్‌రావు, జడ్పీ సీఈవో ఉషా, ఎంపీడీ వోలు, ఏపీవోలు ఈసీలు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-09-04T04:07:40+05:30 IST