దార్శనికుడు మోదీ

ABN , First Publish Date - 2021-05-31T03:37:49+05:30 IST

దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన గొప్ప దార్శనికుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ అని అలంపూర్‌ పట్టణ బీజీపీ నాయకుడు కె.నాగమద్దిలేటి అన్నారు.

దార్శనికుడు మోదీ
రక్తదాన శిబిరంలో నిర్వాహకులతో మాట్లాడుతున్న డీకే అరుణ

అలంపూర్‌, మే 30: దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన గొప్ప దార్శనికుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ అని అలంపూర్‌ పట్టణ బీజీపీ నాయకుడు కె.నాగమద్దిలేటి అన్నారు. బీజీపీ జాతీయ నాయకుల పిలుపు మేరకు, ప్రధాని మోదీ రెండోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం కె.నాగమద్దిలేటి ఆధ్వర్యంలో రాజగోపాల్‌ సహకారంతో పట్టణంలో మా స్కులు, శానిటైజర్లు పంపిణీ  చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు నాగమద్దిలేటి మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ప్రధాన కార్యదర్శి బంగారు శృతి ఆదేశాలు, సూచనల మేరకు కరోనా కట్టడి కోసం ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నామన్నారు. సబ్‌కా సాత్‌ సబ్‌కా వివాస్‌-సబ్‌కా విశ్వాస్‌ నివానందో ముందుకు వెళ్తున్న ప్రధాని మోదీ సాహసోపేత మైన నిర్ణయాలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. ఏడేళ్లు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 200 మాస్కులు, 50 శానిటైజర్లు పంపిణీ చేశా మన్నారు. కార్యక్రమంలో ఎం.జగదీష్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి నరేష్‌ కుమార్‌, యువ మోర్చా అధ్యక్షుడు శరత్‌బాబు, ఐటీ సెల్‌ ఇన్‌చార్జి ఎల్లయ్య పాల్గొన్నారు. 


సుస్థిర పాలన కోసం దేశానికి బీజేపీ అవసరం 

గట్టు: దేశానికి బీజేపీ పాలన అవసరమని మండల బీజేపీ అధ్యక్షుడు పటేల్‌ శివారెడ్డి అన్నారు. ఆదివారం రాష్ట్ర పార్టీ పిలుపుతోపాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆదేశా నుసారం మండలంలో సేవా సంఘటన కార్యక్రమం నిర్వహించారు. భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా గట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు, పాలు అందజేశారు. కరోనాతో దేశం అత్యంత క్లిష్ట సమయంలో ఉన్నా సమర్థవంతగా పాలన అందించిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందన్నారు. మండల కేంద్రంతోపాటు వివి ధ గ్రామాల్లోని కార్యకర్తలు సంఘటన సేవా కార్యక్రమంలో భాగంగా ప్రజలకు మాస్క్‌లు, శానిటైజర్‌ అందజేశారు. కార్యక్రమంలో మండల బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు కొళాయి భాస్కర్‌, సీనియర్‌ నాయకుడు మధుసూదన్‌రావ్‌, పీఎసీఎస్‌ మాజీ చైర్మ న్‌ రాముడు, అలమంచి రాజు, కిట్టుస్వామి, బెల్లం నర్సింహులు, మూర్తి, గిర్ని లక్ష్మన్న పాల్గొన్నారు.


మాస్కులు పంపిణీ చేసిన బీజేపీ నాయకులు

రాజోలి: మండలంలోని పారిశుధ్య కార్మికులకు మండల బీజేపీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి ఆదివారం మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చి పేదలకు అనేక సంక్షేమ పథకాలను తెచ్చిందని, బీజేపీ నిరుపేదల పార్టీ అని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజోలితోపాటు చిన్న ధన్వాడ, మాన్‌దొడ్డి, పచ్చర్ల తదితర గ్రామాల్లో కరోనా సమయంలో నిరంతరం కృషి చేసిన పారిశుధ్య కార్మికులు, ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏబీసీ మండల అధ్యక్షుడు గోవిందురావు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.


బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

గద్వాల: కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బీజేపీ వ్యాప్తంగా సేవహి సంఘటన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో బీజేపీ శ్రేణులు అనేక కార్యక్రమాలు చేపట్టాయి. ఆదివారం జిల్లా కేంద్రంలో ని డీకే అరుణ స్వగృహంలో బీజేపీ నాయకులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా సమయంలో రక్తం లభించిక అనేక మంది ప్రాణాలు కొల్పోతున్నారన్నారు. అత్యవసర సమయాలలో రక్తం అంద క ఇబ్బందులు పడుతున్న వారికి రక్తదాన శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి వచ్చిన 53 మందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గడ్డం కృష్ణారెడ్డి, రామాంజనేయలు, బండల వెంకట్రామలు, డీటీడీసీ నర్సింహులు, వెంకటేశ్వర్‌రెడ్డి, రవిఎక్బోటే, రజక జయశ్రీ, గద్వాల బ్లడ్‌ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. గద్వాల మునిసిపాలిటీలోని 29 వార్డులో కరాటే సత్యం ఆధ్వర్యంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 


ప్రజా సంక్షేమమే బీజేపీ లక్ష్యం

అయిజ: ప్రజా సంక్షేమమే బీజేపీ లక్ష్యమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ పిలుపు మేరకు సేవాహ సంఘటన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా అయిజ మండల పరిధిలోని కొత్తపల్లి, ఉప్పల గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు, ఆశ వర్కర్లు, నిరుపేదలకు బియ్యం, కూరగాయలు, మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా విచ్చేసిన ఆమె పంపిణీ అనంతరం మాట్లాడారు. కరోనా నివారణకు మందు కనిపెట్టే స్థాయికి దేశాన్ని తీసుకొచ్చారని, ప్రతీ ఒక్కరికి ఉచితంగా టీకా అందించడమే లక్ష్యమని తెలిపారు. రాష్ట్రానికి 50 లక్షల డోసుల టీకా మందును అందచేస్తే ఇప్పటి వరకు 30 లక్షలు మాత్రమే వినియోగించారని, మిగతా 20 లక్షల టీకా డోసులు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేసి, రైతు సేద్యానికి ఇస్తానన్న డబ్బులు త్వరితగతిని అందజేయాలని డిమాండ్‌ చేశారు. అయిజ మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్‌ ఆధ్వర్యంలో జిల్లా అధికార ప్రతనిధి రాజగోపాల్‌, కిసాన్‌మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్‌ యాదవ్‌ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పార్టి నాయకులు జలగరి అశోక్‌, మధుసూదన్‌గౌడు, కాలేజి నర్సింహయ్యశెట్టి, జగదీష్‌గౌడు, రాధిక, మహేష్‌లు పాల్గొన్నారు.


పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

గద్వాల రూరల్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడేళ్ల పాలన పూర్తి చేసుకున్నందుకు ఆదివారం మండల పరిధిలోని సంగాల గ్రామంలో క్లాస్‌-1 కాంట్రాక్టర్‌, బీజేపీ నేత అయ్యపు రెడ్డి పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. రాష్ట్ర నాయకులు వెంకటాద్రిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు.  కరోనా సమయంలో లాక్‌డౌన్‌తో పనులు లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారని వారన్నారు. సేవా గుణం కలిగిన అయ్యపురెడ్డి గత ఏడాది కూడా ఎన్నో కుటుం బాలకు నిత్యావసర వస్తువులను అందించి వారి ఆకలిని తీర్చారని అన్నారు. బీజేపీలో ఉండే నాయకులు కార్యకర్తలు ప్రజలకు అండగా ఉండాలని వారు సూచించారు. 

Updated Date - 2021-05-31T03:37:49+05:30 IST