సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2021-02-02T02:36:12+05:30 IST

సంక్షోభ సమయంలోనూ పేదలకు ఎలాంటి కష్టాలు రాకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగించిందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి అన్నారు.

సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు
సీఎం సహాయనిధి చెక్కును అందిస్తున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి

 ఎమ్మెల్యే బీరం

వీపనగండ్ల, ఫిబ్రవరి 1: సంక్షోభ సమయంలోనూ పేదలకు ఎలాంటి కష్టాలు రాకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగించిందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి అన్నారు. ‘మీ కోసం మీ ఎమ్మెల్యే’లో భాగంగా మండలంలోని కల్వరాలలో సోమవారం ఆయన పర్యటించారు. వీధుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రో డ్లు, కాల్వలను పరిశీలించారు. దశల వారిగా సమస్యలు పరిష్కారిస్తామని యాదవ సంఘం భవన నిర్మాణానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. డ్రెయినేజీ కాల్వలో మిషన్‌ భగీరథ పైపు లు ఏర్పాటుచేసినట్లు ఎమ్మెల్యే దృష్టి గ్రామస్థులు తీసుకొచ్చారు. వాటిని తొలగించి నూతన పైపులైన్‌ ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. సర్పంచ్‌ రఘునాథ్‌రెడ్డి,  ఎంపీటీసీ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-02-02T02:36:12+05:30 IST