పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-10-30T04:33:45+05:30 IST

బాధితుల ఫిర్యాదు మేరకు నమోదైన కేసులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ చేతన అన్నారు.

పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించాలి
నేర సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ చేతన

- ఎస్పీ చేతన

- పోలీస్‌ కార్యాలయంలో నేర సమీక్ష

నారాయణపేట క్రైం, అక్టోబరు 29: బాధితుల  ఫిర్యాదు మేరకు నమోదైన కేసులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ చేతన అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ డాక్టర్‌ చేతన అధ్యక్షతన నేర సమీక్షా సమా వే శం నిర్వహించారు. ఈ సందర్భంగా   పోలీస్‌స్టేషన్ల వారిగా పెండింగ్‌ కేసుల పురోగతిని సమీక్షించారు. అ నంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రతీఒక్కరు తమ వ్య క్తిగత ఆస్తులను కాపాడుకునేందుకు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు  ఏర్పాటు చేసుకునేలా ప్రజలను చై తన్యవంతం చేయాలన్నారు. ప్రభుత్వం నిషేధించిన వస్తువులను ఎవరై నా విక్రయిస్తే పీడీ యాక్ట్‌ న మోదు చేయాలన్నారు. దొంగతనం కేసులకు సంబం ధించి నిందితులను గుర్తించి చోరీ సొత్తును రికవరీ చేసి బాధితులకు అప్పగించాలన్నారు. ప్రజలు సైబర్‌ నేరాల బారిన పడకుండా విస్తృతంగా అవగాహన క ల్పించాలన్నారు. హైవేల వెంట రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్‌ గన్‌ ద్వారా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ మధుసూదన్‌రావు, సీఐలు ఇఫ్తెకార్‌ అహ్మద్‌, శివకుమార్‌, జనార్దన్‌, ఎస్‌ఐలు చంద్రమోహన్‌, రాజు, సైదయ్య, యండి నాసర్‌, అరుణ్‌కుమార్‌, నరేందర్‌, నాగరాజు, పర్వతాలు,  శివకుమార్‌నా యుడు, విజయ్‌ భాస్కర్‌, ఐటీ కోర్‌ ఇన్‌చార్జి శ్రీనివాసులు, అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-30T04:33:45+05:30 IST