నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ కేసు

ABN , First Publish Date - 2021-05-31T04:50:47+05:30 IST

రైతులను నకిలీ విత్తనాల బారీ నుంచి కాపాడేందుకు పోలీస్‌శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని, నకిలీ విత్తనాలు వి క్రయించి రైతులను మోసం చేసే వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ కేసు
ఎస్పీ వెంకటేశ్వర్లు

-  జిల్లా వ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీచే తనిఖీలు

- సమాచారం తెలిస్తే నేరుగా ఫోన్‌ చేయండి


మహబూబ్‌నగర్‌, మే 30 : రైతులను నకిలీ విత్తనాల బారీ నుంచి కాపాడేందుకు పోలీస్‌శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని, నకిలీ విత్తనాలు వి క్రయించి రైతులను మోసం చేసే వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఆది వారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీస్‌, వ్యవసా య శాఖ, విజిలెన్స్‌ అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ వేసి తనిఖీలు చేస్తున్నామన్నారు. రైతులు ఆరుగాలం ఎంతో కష్టపడి వ్యవసాయం చేస్తుం టారని, అలాంటి రైతులను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారి వివరాలు పోలీసులకు లేదంటే నేరుగా తనకు ఫోన్‌ చేసి సమాచారం ఇస్తే వారిపై చర్యలు తీసు కుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత ్వం, డీజీపీ ఆదేశాల మేరకు ఇప్పటికే విత్తన విక్రయదుకాణాలపై నిఘా ఉంచామన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విత్తన వ్యాపారులపై నిఘా ఉంచినట్లు తెలిపార. రైతులు గుర్తింపులేని సంస్థలతో విత్తనాలు కొనుగోలుచేసి మోసపోవద్దన్నారు. లూజు విత్తనాలు కొనుగోలు చేయకూడదని, అనుమానం ఉంటే వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు ఎప్పటికప్పుడు విత్తన విక్రయాలపై దృష్ఠి సారించాలని, ప్రజలనుంచి సమాచారం తీసుకుని వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.

Updated Date - 2021-05-31T04:50:47+05:30 IST