పాఠశాలల పరిశుభ్రత బాధ్యత పంచాయతీలదే

ABN , First Publish Date - 2021-08-26T04:36:52+05:30 IST

పాఠశాలలో పరిశుభ్ర తను అమలు చేయాల్సిన బాధ్యత స్థానిక గ్రామ పంచాయతీలదేనని జిల్లా విద్యాధికారి రవీందర్‌ అ న్నారు.

పాఠశాలల పరిశుభ్రత బాధ్యత పంచాయతీలదే
ప్రధానోపాధ్యాయులు సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో రవీందర్‌

పెద్దమందడి, ఆగస్టు 25: పాఠశాలలో పరిశుభ్ర తను అమలు చేయాల్సిన బాధ్యత స్థానిక గ్రామ పంచాయతీలదేనని జిల్లా విద్యాధికారి రవీందర్‌ అ న్నారు. సెప్టెంబరు 1 నుంచి పాఠశాలలు ప్రారం భం కానున్న సందర్భంగా పాఠశాలలో కరోనా నిబం ధనలు అమలు పరిచేందుకు బుధవారం మండలం లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యా యులకు, పంచాయతీ కార్యదర్శులకు ఎంపీపీ మేగా రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ స మావేశానికి జిల్లా విద్యాధికారి ముఖ్య అతిథిగా హా జరై మాట్లాడారు. పాఠశాలలు పూర్తి స్థాయిలో ప్రా రంభమవుతున్న సందర్భంగా ప్రజాప్రతినిధులు, ఎం పీపీ, జడ్పీటీసీ, సర్పంచ్‌, ఎంపీటీసీల సహకారంతో విద్యాశాఖ, పంచాయతీ రాజ్‌ శాఖ, వైద్య శాఖతో పాటు అందరం అన్ని శాఖల కృషితో పాఠశాలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. మన పెద్ద మందడి మండలానికి రెండు డిజిటల్‌ ఎలకా్ట్రని క్‌ బోర్డులు మంజూరయ్యాయని, ఒకటి జడ్పీహెచ్‌ ఎస్‌ బలిజపల్లికి, మరొకటి జడ్పీహెచ్‌ఎస్‌ పెద్ద మందడికి మంజూరైనట్లు ఆయన తెలిపారు. మంత్రి నిరంజన్‌ రెడ్డి మొత్తం జిల్లాకు 7 మంజూరు చేయిం చడం జరిగిందని, ఇందులో రెండు పెద్దమందడి మండ లానికి వచ్చాయన్నారు. ఎంపీపీ మేగారెడ్డి మాట్లాడుతూ పాఠశాలలు  సెప్టెంబరు 1 నుంచి   ప్రారంభం అవుతున్నందున ప్రధానోపాధ్యాయులు, గ్రామ పంచాయతీ కార్యదర్శు లు సమన్వయంతో పని చేయాలని స్థానిక సర్పం చ్‌లు, ఎంపీటీసీల సహకారంతో పాఠశాలలకు పరిశు భ్రంగా ఉంచాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, పాత బిల్డింగ్‌లు ఉంటే రంగులు వేయాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  అనంతరం కేబీవీ పాఠ శాలను సందర్శించారు. సమావేశంలో ఎంఈవో, ఎంపీడీవో, ఎంపీవో, ప్రధానోపాధ్యాయులు క్రాంతి, పంచాయతీ కార్శులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-26T04:36:52+05:30 IST