బైక్‌లు ఢీకొని ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-03-15T05:17:47+05:30 IST

మండల పరిధిలోని గుంటిపల్లి రోడ్డులో రెండు బైక్‌లు ఢీకొని ఆదివారం ఒకరు మృతి చెందారు.

బైక్‌లు ఢీకొని ఒకరి మృతి

గద్వాల రూరల్‌, మార్చి 14: మండల పరిధి లోని గుంటిపల్లి రోడ్డులో రెండు బైక్‌లు ఢీకొని ఆదివారం ఒకరు మృతి చెందారు. గద్వాలకు చెందిన చాకలి నాగరాజు(45) గుంటిపల్లి గ్రామం నుంచి గద్వాలకు మోటార్‌ బైక్‌పై వస్తున్నాడు. ఇదే సమయంలో గుంటిపల్లికి చెందిన బొజ్జన్న మోటార్‌ బైక్‌పై గద్వాల నుంచి గ్రామానికి వెళ్తున్నాడు. గుంటిపల్లి రోడ్డులో కోళ్లఫారం సమీపంలోకి రాగానే రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటి కే సాకలి నాగరాజు మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడ్డ బొజ్జ న్నకు ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స కోసం కర్నూల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగరాజుకు భార్య వెంకటమ్మ నలుగురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Updated Date - 2021-03-15T05:17:47+05:30 IST