ఆలస్యంపై.. ఆందోళన

ABN , First Publish Date - 2021-11-06T05:07:52+05:30 IST

యాసంగి నుంచి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఽధాన్యం కొనడం సాధ్యం కాదని, రైతులు వీలైనంత మేర ప్రత్యామ్నాయ పంటలకు మళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం పదే, పదే సూచిస్తున్న నేపథ్యంలో వానాకాలం ధాన్యమైనా కొంటారా? లేదా? అనే రైతుల సందేహానికి తెరపడింది. ఈ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు రంగం సిద్ధమైంది.

ఆలస్యంపై.. ఆందోళన
మహబూబ్‌నగర్‌ మండలం మన్యంకొండ వద్ద ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రం సమీపంలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం

మార్కెట్లకు వస్తున్న ధాన్యం 8 ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు

ఉమ్మడి జిల్లాలో ఒక్క పాలమూరులోనే ఓపెన్‌ 8  6.40 లక్షల ఎకరాల్లో వరి సాగు

16.66 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా  

795 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం

ఉత్పత్తిలో 80 శాతం కొనేలా ప్రణాళిక


యాసంగి నుంచి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఽధాన్యం కొనడం సాధ్యం కాదని, రైతులు వీలైనంత మేర ప్రత్యామ్నాయ పంటలకు మళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం పదే, పదే సూచిస్తున్న నేపథ్యంలో వానాకాలం ధాన్యమైనా కొంటారా? లేదా? అనే రైతుల సందేహానికి తెరపడింది. ఈ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు రంగం సిద్ధమైంది. గత మూడేళ్ల  మాదిరిగానే ఈ సారీ సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ ద్వారా ధాన్యం కొనాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో కలెక్టర్లు రంగంలోకి దిగి, కార్యాచరణ మొదలుపెట్టారు. అయితే ధాన్యం మార్కెట్లకు వస్తున్నా ఇంకా కేంద్రాలు ప్రారంభం కాకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్క పాలమూరులోనే శనివారం కేంద్రాలను ప్రారంభించారు.

- మహబూబ్‌నగర్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి


ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వానాకాలం ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మా ర్కెట్లకు ఇప్పటికే ధాన్యం వస్తుండగా, కేం ద్రాల ప్రారంభంలో జాప్యం జరుగుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో శుక్రవారం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవగా, నారాయణపేట జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో మరో వారం తర్వాత కేంద్రాలు ప్రారంభిస్తామని సివిల్‌ సప్లయీస్‌ అధికారులు తెలిపారు. ఉమ్మడి జి ల్లాలో ఈ సీజన్‌ లో 6.40 లక్షల ఎకరాల్లో వరి సాగవగా, 16.66 లక్షల మెట్రిక్‌ ట న్నుల ధాన్యం దిగు బడి వస్తుందని అం చనా వేశారు. 795 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు.


ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్‌ ద్వారా..

సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ ఆధ్వ ర్యంలో ఐకేపీ, మెప్మా, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ సీజన్‌లో ఉత్పత్తి అయిన ధాన్యంలో దాదాపు 80 శాతం వరకు కొనేలా ప్రణాళిక రూపొందించారు. 90 శాతం వరకు సన్న రకాలే సాగు చేయడంతో స్థానిక, సొంత అవసరాల మేరకు సుమారు 14 శాతం ధాన్యం మార్కెట్లకు రాకుండా రైతుల వద్దే ఉంటుందని, మిగిలిన ఆరు శాతం జిల్లా మిల్లర్లు నేరుగా కొంటారని అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తంగా 16,66,377 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తుందని అంచనా వేయగా, ఇందులో దాదాపు 13.33 లక్షల మెట్రిక్‌ టన్నులు ప్రభుత్వ సంస్థలు కొనాల్సి ఉంటుంది. 


కేంద్రాల ఆలస్యంపై ఆందోళన

ధాన్యం అధికంగా వచ్చే వనపర్తి జిల్లా తో పాటు, మహబూబ్‌నగర్‌, నారాయణ పేట జిల్లాల్లో ఇప్పటికే వరి కోతలు పూర్తయి, వడ్లు మార్కెట్లకు వస్తున్నాయి. ఒకవైపు వాతావరణం మార్పులతో వాన లు పడుతాయనే హెచ్చరికలు వస్తుం డటంతో కేంద్రాలు ఇంకా ప్రారంభం కాక పోవడంపై రైతులు ఆందోళనకు గురవు తున్నారు. వానాకాలం ధాన్యం కొనేది ఖాయమని ఒకవైపు ప్రభుత్వం పదేపదే చెబుతున్నా, కేంద్రాల ప్రారంభంలో అధి కార యంత్రాంగం జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహబూబ్‌ నగర్‌లో కేంద్రాలు శనివారం మొదలవగా, మిగిలిన జిల్లాల్లో మరో వారం దాకా ప్రారంభించే పరిస్థితి లేదు. దీంతో రైతులు అనివార్యంగా మార్కెట్లకు ధాన్యం తెస్తే, తేమశాతం ఎక్కువగా ఉందనే సాకుతో రేటు తగ్గిస్తున్న పరిస్థితి నెల కొంది. ఉన్నతాధికారులు స్పందించి వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో సైతం ఒకటి, రెండు రోజుల్లో కేంద్రాలు ప్రారం భించేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ వస్తోంది. Updated Date - 2021-11-06T05:07:52+05:30 IST