అధికారే దళారీ?

ABN , First Publish Date - 2021-06-22T04:48:18+05:30 IST

పౌర సరఫరాల శాఖలో ఓ అధికారి డీలర్లు, రైస్‌ మిల్లర్లకు దళారీగా వ్యవహరిస్తూ, రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తుండటం విమర్శలకు దారీ తీస్తోంది..

అధికారే దళారీ?
నాగర్‌కర్నూల్‌లో పట్టుబడ్డ రేషన్‌ బియ్యం (ఫైల్‌)

- బిజినేపల్లి, నాగర్‌కర్నూల్‌ కేంద్రంగా పేదల బియ్యం పక్క దారి

- డీలర్లు, మిల్లర్లకు మధ్యవర్తిగా ఓ పౌర సరఫరాల శాఖ అధికారి

- కొందరి రేషన్‌ కార్డులకు బంధువుల ఫోన్‌ నంబర్ల అనుసంధానం

- డీలర్లు సేకరించిన బియ్యానికి ఆర్వోలు ఇస్తున్న యంత్రాంగం

- చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారుల విఫలం


నాగర్‌కర్నూల్‌ (ఆంధ్రజ్యోతి) : పౌర సరఫరాల శాఖలో ఓ అధికారి డీలర్లు, రైస్‌ మిల్లర్లకు దళారీగా వ్యవహరిస్తూ, రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తుండటం విమర్శలకు దారీ తీస్తోంది.. రెండు స్టాక్‌ పాయింట్లలో అన్నీ తానై వ్యవహరిస్తున్న సదరు అధికారి ఇంకొకరికి పోస్టింగ్‌ రాకుండా ఉన్నతాధికారులను సైతం మేనేజ్‌ చేస్తుండడం నాగర్‌కర్నూల్‌ జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది.. సదరు అధికారి అవినీతి పరాకాష్టకు చేరుకోవడంతో, ఒక్కో సంఘటన క్రమంగా వెలుగులోకి వస్తోంది.. స్టేజ్‌-2 కాంట్రాక్టర్లను కూడా డమ్మీలుగా మార్చి తానుఆడిందే ఆట పాడిందే పాటగా అతను వ్యవహరిస్తున్న తీరు సొంత శాఖలోనే అనేక విమర్శలకు దారీ తీస్తోంది..

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, కొల్లా పూర్‌ నియోజకవర్గాల్లో అన్నపూర్ణ, అంత్యోదయ, ఆహారభద్రత కార్డులు మొత్తం 2,33,928 ఉన్నాయి. ఈ కార్డులకు 4,869 మెట్రిక్‌ టన్నుల బి య్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్నది. అయితే, ఈ బియ్యం పంపిణీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న సాంకేతిక విధానాలను తుంగలోకి తొక్కి పౌర సరఫరాల శాఖకు చెందిన కొందరు అధికారులు, డీలర్లు, రైస్‌ మిల్లర్లు తమ ఇష్టా రాజ్యంగా వ్యవహ రిస్తున్నారు. రేషన్‌ బియ్యం తీసుకోవాలంటే కుటుంబంలో ఎవరిదైనా ఫో న్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ఆధారంగా బియ్యం సరఫరా చేయచాలనే ని బంధన ఉంది. ఈ నిబంధనను ఆచరిస్తూనే తెలివిగా డీలర్లు చౌక బి య్యాన్ని దారీ మళ్లిస్తున్నారు. కరోనా, జీవనోపాధి కోసం వేర్వేరు రాష్ట్రాల కు వెళ్లిన లబ్ధిదారుల బంధువుల సెల్‌ఫోన్‌ నంబర్ల ను రేషన్‌ కార్డులకు అనుసంధానం చేయించారు. దీన్ని సాకుగా చే సుకున్న డీలర్లు అసలు కార్యాచరణను అమలు చే స్తున్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం రూపాయికి కిలో చొప్పున బియ్యం అందిస్తుండగా, ఆ బియ్యాన్ని డీలర్లు లబ్ధిదారుల నుంచి రూ.6 నుంచి రూ.8కి కొనుగోలు చేస్తున్నారు. భారీ ఎత్తున బి య్యాన్ని తరలించే క్రమంలో చట్టబద్ధత అవసరం కావడంతో, పౌర సరఫరాల శాఖకు చెందిన అధికారుల సహకారం తీసుకుంటున్నా రు. డీలర్లు సేకరించిన బియ్యాన్ని స్టాక్‌ పాయింట్లలో ఉన్న అధికారులకు కిలోకు రూ.8 చొప్పున అమ్ముకుంటున్నారు. బియ్యం రైస్‌ మిల్లర్లకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా చేరడానికి పౌరసరఫరా శాఖకు చెందిన కొంద రు అధికారులు ఆర్‌వోల రూపంలో చట్టబద్ధత కల్పిస్తున్నారు. నాగర్‌క ర్నూల్‌, బిజినేపల్లి స్టాక్‌ పాయింట్ల నుంచి ఈ మధ్య కాలంలో రేషన్‌ బి య్యం తిమ్మాజిపేట, బిజినేపల్లి మండలాలకు చేరవేస్తుండటం వెనక ఓ అధికారి నేరుగా చొరవ తీసుకుంటుండటం గమనార్హం. నాగర్‌కర్నూల్‌ ప ట్టణంలో ఓ పెట్రోల్‌ బంక్‌లో కూర్చొని కొంత మంది డీలర్లను పిలిపించు కొని వారి వద్ద మిగిలిన బియ్యానికి సంబంధించిన డబ్బులు ముట్టజెప్ప డంతో పాటు భవిష్యత్తులో తాము ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తా మో అనే విషయంపై సమావేశం నిర్వహించడం కొసమెరుపు. బాహాటం గానే ఈ అవినీతి జరుగుతున్నా, ఉన్నతాధికారులు మాత్రం చర్యలు తీ సుకోవడంలో విఫలమవుతున్నారు.

Updated Date - 2021-06-22T04:48:18+05:30 IST