పని చేయని నిఘా నేత్రాలు

ABN , First Publish Date - 2021-02-02T03:18:01+05:30 IST

జిల్లా కేంద్రంలో నిఘా వ్యవస్థ నీరుగారిపోతోంది.

పని చేయని నిఘా నేత్రాలు

పట్టించుకోని పోలీసులు

నారాయణపేట క్రైం, జనవరి 31: జిల్లా కేంద్రంలో నిఘా వ్యవస్థ నీరుగారిపోతోంది. సీసీ కెమెరాలు పని చేయకున్నా పోలీస్‌ అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా ఏర్పాటు కాకముందు పోలీస్‌ అధికారులు స్థానిక ప్రజలు, వ్యాపారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రధాన కూడళ్లు, ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమోరాలను ఏర్పాటు చేసి ప్రస్తుత జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ విభాగం పూర్తిగా కనుమరుగైంది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఒక్కటంటే ఒక్కటి కూడా పని చేయడం లేదు. దొంగతనాలు జరిగిన ప్పుడు మాత్రమే పోలీసులకు సీసీ కెమెరా లు గుర్తొస్తాయని, ఆ తరువాత వాటి గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పం దించి నిఘా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Updated Date - 2021-02-02T03:18:01+05:30 IST