జోరుగా, హుషారుగా..

ABN , First Publish Date - 2022-01-01T05:27:37+05:30 IST

జిల్లా వ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు జోరుగా ప్రారంభమయ్యాయి.

జోరుగా, హుషారుగా..
గద్వాల పట్టణంలోని ఓ బేకరీలో కేక్‌లను కొనుగోలు చేస్తున్న జనం

- జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన కొత్త సంవత్సరం వేడుకలు

- పాఠశాలల్లో సంబురాలు చేసుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు

- ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసిన బేకరీలు, మిఠాయి దుకాణాలు

- మద్యం దుకాణాల వద్ద కిక్కిరిసిన కొనుగోలుదారులు

గద్వాల టౌన్‌/ అయిజ/ గద్వాల క్రైం/ డిసెంబరు 31 : జిల్లా వ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు జోరుగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచే బేకరీలు, మిఠాయి దుకాణాల్లో జనం సందడి మొదలయ్యింది. సాయంత్రానికి దుకాణాలు రద్దీగా మారాయి. జిల్లా కేంద్రంలోని బేకరీలు, స్వీట్‌ షాపులు కేకులు, మిఠాయిల విక్రయానికి ప్రత్యేక స్టాళ్లు ఏర్పా టు చేశారు. కొన్ని బేకరాల్లో ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటించారు. కేకులు కొన్న వారికి కూల్‌డ్రింక్‌ ఉచితంగా అందించారు. జిల్లా కేంద్రంలోని మద్యం, మాంసం దుకాణాల ముందు జనం బారులు తీరారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలను తెలుపుకునేం దుకు చిన్నారులు గ్రీటింగ్‌ కార్డులను కొనుగోలు చేశారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ గద్వాల పట్టణంలోని పలు పాఠశాలల్లో వేడుకలు నిర్వహించు కున్నారు. కేక్‌ను కట్‌చేసి పంచుకున్నారు. 


- అయిజ పట్టణంలో శుక్రవారం సంబురాలు జరుపుకున్నారు. పట్టణంలోని బీజీఆర్‌ పాఠశాలలో విద్యా ర్థులు కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించుకున్నారు. అనంతరం విద్యార్థులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. పట్టణంలోని బేకరీలు, మిఠాయిల దుకాణాలు ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి కేకులు విక్రయించారు.  


బందోబస్తు కట్టుదిట్టం

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పోలీసులు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రాకపో కలను క్రమబద్ధీకరించేందుకు శుక్రవా రం రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు పట్టణాల్లోని ప్రధాన రహదారులపై బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. నూతన సంవత్సరం వేడుకల సం దర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గద్వాల పట్టణంలో రాత్రి 10 తర్వాత ప్లైఓవర్‌ తో పాటు జమ్మిచేడు, ధరూర్‌, అయిజ, నదీ అగ్ర హారం రోడ్లను మూసివేశారు. డ్యాం రోడ్డు, రింగ్‌ రోడ్ల పై బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు చేప ట్టారు. అన్ని ప్రధాన కూడళ్లలో డ్రంకెన్‌డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించారు. న్యూ ఇయర్‌ వేడుకలను ఇంట్లో కుటుంబ సభ్యులతో ప్రశాతంగా జరుపుకోవాలని సూచించారు. ఆరుబయట మద్యం తాగినా, మద్యం తాగి వాహనాలు నడిపినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ షేక్‌ మహబూబ్‌ బాషా హెచ్చరించారు. 



Updated Date - 2022-01-01T05:27:37+05:30 IST