విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి

ABN , First Publish Date - 2021-12-29T05:13:24+05:30 IST

చూసి నేర్చుకోవడం ద్వారా విషయ పరిజ్ఞానాన్ని అధికంగా అర్జించవ చ్చని తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ వి.రవీందర్‌ రెడ్డి అన్నారు.

విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి
చెరువులో చేపపిల్లలను వదులుతున్న వైస్‌ చాన్స్‌లర్‌

- తెలంగాణ  పశువైద్య విశ్వవిద్యాలయం

   వైస్‌ చాన్స్‌లర్‌ రవీందర్‌ రెడ్డి

- పిషరీస్‌ కళాశాల పరిశీలన

 పెబ్బేరు, డిసెంబరు 28: చూసి నేర్చుకోవడం ద్వారా విషయ పరిజ్ఞానాన్ని అధికంగా అర్జించవ చ్చని తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ వి.రవీందర్‌ రెడ్డి అన్నారు. మంగళ వా రం మండల కేంద్రం స మీపంలోని పిషరీస్‌ కళా శాలను వైస్‌ చాన్స్‌లర్‌ పరిశీలించారు.  ఈ సంద ర్భంగా విద్యార్థుల బోధనకు అవసరమైన చేప పిల్లలను కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన  నీటి తొట్టిలో వదిలారు. అలాగే మంచినీటి చెరు వును ప్రా రంభించారు. అనంతరం కళాశాల అసో సియేట్‌ డీన్‌ డాక్టర్‌ కిషన్‌ అధ్యక్షతన  సమావే శాన్ని నిర్వహించారు.  రెండవ సెమిస్టర్‌ విద్యార్థు లు అనుభవ పూ ర్వక అభ్యసనం ద్వారా నేర్చుకు న్న అనుభవాన్ని పంచుకున్నారు. అనంతరం ఆయన బాలికల హాస్టల్‌ నిర్మాణం పనులను పరి శీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బోధన సిబ్బంది హోననంద, శ్రీబాలాజీ, ముత్తప్ప, దేవానంద్‌, ఓబులెస్‌, శ్రీను, మోమన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-29T05:13:24+05:30 IST