జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-03-23T05:06:51+05:30 IST

విద్యార్థులు విద్యతో పాటు జీవన నైపుణ్యాలు నేర్చుకోవా లని కలెక్టర్‌ హరిచందన అన్నారు.

జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవాలి : కలెక్టర్‌

నారాయణపేట టౌన్‌, మార్చి 22 : విద్యార్థులు విద్యతో పాటు జీవన నైపుణ్యాలు నేర్చుకోవా లని కలెక్టర్‌ హరిచందన అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో 6, 7, 8 తరగతి విద్యార్థినులకు రూమ్‌ టూ రీడ్‌ అనే సంస్థ ఆధ్వర్యంలో జీవన నైపుణ్యం శిక్షణ వర్క్‌ షీట్‌లను కలెక్టర్‌ అందించారు. కార్యక్రమంలో డీఈఓ రవీందర్‌, జీసీడీఓ అనురాధ, శ్వేత, చరితవ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.వర్షపు నీటిని కాపాడాలి 

 వర్షపు నీటిని కాపాడే ప్రయత్నం చేద్ధామని కలెక్టర్‌ హరిచందన కోరారు. సోమవారం ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్చువల్‌ సమావేశం ద్వారా జిల్లాలోని కలెక్టర్లకు ప్రధాని మోదీ నీటి వినియోగం, నీటి సంరక్షణపై సూచనలు చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వర్షా కాలంలో కురిసే ప్రతి వర్షపు నీటిని సంరక్షించేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.


Updated Date - 2021-03-23T05:06:51+05:30 IST