ప్రకృతి వనాలను సమర్థవంతంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-08-22T04:13:49+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రకృతి వనాలను సమ ర్థవంతంగా నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్‌ శ్రుతి ఓజా సూచించారు.

ప్రకృతి వనాలను సమర్థవంతంగా నిర్వహించాలి
ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ శ్రుతిఓజా

- కలెక్టర్‌ శ్రుతి ఓజా 

- కొండపల్లి గ్రామంలో 

 అభివృద్ధి పనుల పరిశీలన

గద్వాల రూరల్‌, ఆగస్టు 21 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రకృతి వనాలను సమ ర్థవంతంగా నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్‌ శ్రుతి ఓజా సూచించారు. శనివారం మండలంలోని కొం డపల్లి గ్రామంలో పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం, సిగ్రియేషన్‌ షెడ్లను కలెక్టర్‌ పరిశీలించారు. ప్రకృతి వనంలోని మొక్కలకు ప్రతీరోజు క్రమం తప్పకుండా నీరు పోయాలన్నారు. ఉపాధిహామీ పనులు నిర్వ హించే వారితో మాట్లాడిన కలెక్టర్‌ జాబ్‌ కార్డులు ఉన్నాయా.. డబ్బులు కరెక్టు అకౌంట్‌లో పడుతు న్నా యా.. అని అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కూలీల కు తప్పనిసరిగా జాబ్‌కార్డు ఉండాలని అదికారులకు సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యా లయానికి వెళ్లి రికార్డులను తనిఖీ చేశారు. ఏడు రకాల రిజిస్ట్రర్లను తప్పనిసరిగా నిర్వహిస్తూ, వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలని పంచాయతీ సెక్ర టరీని ఆదేశించారు. గ్రామంలో చేపట్టే ప్రతీ ఉపాధి హామీ పనికి సంబంధించి వర్క్‌ ఫైల్‌ను అందుకు సంబంధించిన ఫొటోలతో ఉంచుకోవాలని సూచిం చారు. సర్పంచులు కూడా ప్రతి పని ఫొటోల ద్వారా రికార్డు చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట డీఆర్‌డీవో ఉమాదేవి, ఎంపీపీ ప్రతాప్‌గౌడ్‌, స్పెషల్‌ అధికారి వెంకటేశ్వర్లు, తదితరులున్నారు. 

Updated Date - 2021-08-22T04:13:49+05:30 IST