సీడ్‌ పత్తి రైతుల సమస్యపై జాతీయ స్థాయిలో చర్చ

ABN , First Publish Date - 2021-10-30T04:24:47+05:30 IST

సీడ్‌ పత్తి రైతుల సమస్యలను జాతీయ స్థాయిలో చర్చిస్తామని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి, ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ జాతీయ కోఆర్డినేటర్‌ సురవరం విజయలక్ష్మి అన్నారు.

సీడ్‌ పత్తి రైతుల సమస్యపై జాతీయ స్థాయిలో చర్చ
సమావేశంలో మాట్లాడుతున్న సురవరం విజయలక్ష్మి

- ఐఎల్‌వో జాతీయ కోఆర్డినేటర్‌ సురవరం విజయలక్ష్మి

గద్వాల టౌన్‌, అక్టోబరు 29 : సీడ్‌ పత్తి రైతుల సమస్యలను జాతీయ స్థాయిలో చర్చిస్తామని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి, ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ జాతీయ కోఆర్డినేటర్‌ సురవరం విజయలక్ష్మి అన్నారు. సీడ్‌పత్తి సాగు లాభసాటిగా ఉన్నా, రైతులు ఎందుకు అప్పులపాలు అవుతున్నారో ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. పట్టణంలోని టీఎన్జీవో భవనంలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్నే షనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌(ఐఎల్‌వో) జిల్లా కోర్‌ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. బాలకార్మిక వ్యవస్థ, నిరక్ష్యరాస్యత, వెనుకబాటు తనం, ఆత్మహత్యలకు కారణాలను విశ్లేషించే ఓపిక ప్రభుత్వాలకు లేదా అని నిలదీశారు. అభం, శుభం ఎరుగని పసిపిల్లలు పత్తి చేలల్లో కార్మికులుగా మారుతుండడం విచారకరమన్నారు. ఈ సమస్యను జాతీయస్థాయిలో చర్చినీయాంశంగా మారుస్తామన్నారు. వ్యవసాయ శాఖ అధికారి సక్రియా నాయక్‌, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ నరసిం హులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రజా, విద్యార్థి, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో సీడ్‌పత్తి రైతుల సమస్యలు, బాలకార్మిక వ్యవస్థ, నిరక్షరాస్యత తదితర అంశాలపై సుదీర్ఘ చర్చ నిర్వహించారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాల గోపాల్‌రెడ్డి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ ఇక్బాల్‌ పాషా, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాల్‌రావు, లీగల్‌ అడ్వైజర్‌ జయభారతి, ఐఎఫ్‌ టీవో నాయకులు కృష్ణ, రహెమాన్‌, ఆశన్న, రంగన్న, వీరాంజనేయులు, అతిక్‌వుర్‌ రెహమాన్‌, రెహ్మ తుల్లా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T04:24:47+05:30 IST