హక్కుల కోసం ఉద్యమించాలి

ABN , First Publish Date - 2021-05-03T04:14:09+05:30 IST

అంతరాలు, అసమానతలు లేని సమాజ నిర్మాణమే ప్రపంచ కార్మికుల దినోత్సవం ప్రధాన ఉద్దేశమని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు అన్నారు.

హక్కుల కోసం ఉద్యమించాలి
జెండాను ఎగురవేసి నినాదాలు చేస్తున్న ఏఐటీయూసీ నాయకులు

ఇటిక్యాల, మే 2: అంతరాలు, అసమానతలు లేని సమాజ నిర్మాణమే ప్రపంచ కార్మికుల దినోత్సవం ప్రధాన ఉద్దేశమని  ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు అన్నారు. ప్రపంచ కార్మికుల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఇటిక్యాల మండలం జింకలపల్లి స్టేజీ దగ్గర తెలంగాణ హమాలీ కార్మికుల సంఘం, ఏఐటీయూసీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు బాలగోపాల్‌రెడ్డి కార్మిక జెండాను ఎగురవే శారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు  ఆంజనేయులు మాట్లాడుతూ పెట్టుబడిదారుల చేతులలో కీలుబొమ్మలుగా మారకుండా కార్మికులను చైతన్య పరచి న్యాయమైన హక్కులకోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఎర్రజెండా ప్రతీ కార్మికుడికి అండగా ఉంటుందని, ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని ఆయన కోరారు. మే డే సంబురాలు వారం రోజుల పాటు ఆయా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు ఆశన్న, సీపీఐ నాయకులు చెన్నయ్య, పెద్ద గోపాల్‌, రాంబాబు, నాగరాజు, గోకారి, రాముడు, వెంకటేశ్‌, మద్దిలేటి, వెంకట్రాములు, లోకన్న పాల్గొన్నారు.  

Updated Date - 2021-05-03T04:14:09+05:30 IST