చేపల విక్రయ వాహనంతో ఆర్థికంగా బలపడాలి

ABN , First Publish Date - 2021-08-28T04:00:55+05:30 IST

సంచార చేపల విక్రయ వాహనంతో మహిళా సంఘం సభ్యులు ఆర్థి కంగా బలపడాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యం వద్ద పట్టణంలోని విజయదుర్గ మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులకు మత్స్య శాఖ ఆధ్వర్యంలో మంజూరు చేసిన సంచార చేపల విక్రయ వాహనాన్ని ఎమ్మెల్యే శుక్రవారం అందించారు.

చేపల విక్రయ వాహనంతో ఆర్థికంగా బలపడాలి
మహిళా సంఘం సభ్యులకు చేపల సంచార విక్రయ వాహనాన్ని అందిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

జడ్చర్ల, ఆగస్టు 27: సంచార చేపల విక్రయ వాహనంతో మహిళా సంఘం సభ్యులు ఆర్థి కంగా బలపడాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యం వద్ద పట్టణంలోని విజయదుర్గ మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులకు మత్స్య శాఖ ఆధ్వర్యంలో మంజూరు చేసిన సంచార చేపల విక్రయ వాహనాన్ని ఎమ్మెల్యే శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక యూనిట్‌కు రూ.10 లక్షలని, రూ.6 లక్షలు సబ్సిడీ లభిస్తుందని చెప్పారు. లబ్ధిదారులు కేవలం రూ.4లక్షల రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. సంచార చేపల విక్రయ వాహనంతో సంఘం సభ్యులు ఆర్థికంగా బలోపేతం కావాలని, స్వశక్తితో మరింత ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ కోడ్గల్‌ యాదయ్య, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపలి లక్ష్మి, కౌన్సిలర్‌లు చైతన్య చౌహాన్‌, ప్రశాంత్‌రెడ్డి, నందకిశోర్‌గౌడ్‌, మత్స్య శాఖ జిల్లా అధికారి పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-28T04:00:55+05:30 IST