నర్సింగ్‌ కళాశాలలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-12-09T04:47:25+05:30 IST

విద్య, వైద్య అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని రాష్ట్ర నర్సింగ్‌ కళాశాల డైరెక్టర్‌ విద్యుల్లత అన్నారు.

నర్సింగ్‌ కళాశాలలో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న డైరెక్టర్‌ విద్యుల్లత

- ఈ ఏడాది మెరిట్‌ ఆధారంగా ఎంపిక

-  ఆన్‌లైన్‌లో నమోదుకు 

ఈ నెల 15న చివరితేదీ

- రాష్ట్ర నర్సింగ్‌ కళాశాల డైరెక్టర్‌ విద్యుల్లత

గద్వాల క్రైం, డిసెంబరు 8 : విద్య, వైద్య అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని రాష్ట్ర నర్సింగ్‌ కళాశాల డైరెక్టర్‌ విద్యుల్లత అన్నారు. బుధవా రం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ  సీఎం కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా 13 నర్సింగ్‌ కాలేజీలను ప్రకటించారని, అందులో భాగంగా జోగుళాంబ గద్వాల ప్రాంతానికి నర్సింగ్‌ కళాశాల మంజూరు అ యిందన్నారు. కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ద్వారా నర్సింగ్‌ కాలేజీలో అడ్మిషన్‌ కోసం ఇంటర్‌ బైపీసీ పూర్తి చేసిన విద్యార్థులు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ ఏడాది మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్లు జరుగుతాయని, వచ్చే ఏడాది నుంచి నీట్‌ ద్వారా పూర్తి చేస్తారన్నారు. నర్సింగ్‌ కళాశాలను గద్వా ల జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది 100మంది విద్యార్థులకు కళాశాలలో విద్య ను అభ్యసించవచ్చన్నారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో నర్సింగ్‌ కళాశాల ప్రారంభం అవుతుందన్నారు. విద్వత్‌ గద్వాల సాధికారతకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల గద్వాల ప్రాంతం అభివృద్ధిలో రాష్ట్రంలోనే వెనుకబడి ఉందన్నారు. విద్య, వైద్య రంగాలలో కూడా గద్వాల ప్రాంతాన్ని ముందుంజలో ఉండేలా కృషి చేస్తానన్నారు. వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి సారించి పేదప్రజలకు వైద్యసదుపాయాలు అందేలా చూస్తామన్నారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసౌకర్యాలు లేక ఇతర ప్రాం తాలకు వెళ్లేవారని ఇప్పడు ముఖ్యమంత్రి సహకారంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లా ఆసుపత్రిలో 57 రకాల ఉచిత పరీక్షలతో పాటు మందులను కూడా అందేలా కృషి చేసిన ఘనత ముఖ్యమంత్రికి చెందుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తానన్నారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, డీసీసీ బీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌ సుభాన్‌, మార్కెట్‌ కమిటీ చై ర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ, ఎంపీపీ ప్రతాప్‌గౌడ్‌, ప్రిన్సిపాల్‌ కమల, వైస్‌ ప్రిన్సిపాల్‌ సత్యప్రియ తదితరులున్నారు.

Updated Date - 2021-12-09T04:47:25+05:30 IST