ఫ్యాక్టరీ దుర్వాసనను నివారించాలి
ABN , First Publish Date - 2021-02-02T02:55:17+05:30 IST
ఇటిక్యాల మండలంలోని 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఎన్‌ఎన్‌ఎస్ పరిశ్రమ నుంచి దుర్వాసన వెలువడకుండా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ మందా జగన్నాథ్ యాజమాన్యానికి సూచించారు.

- మాజీ ఎంపీ మందా జగన్నాథ్
ఇటిక్యాల చౌరస్తా, ఫిబ్రవరి 1: ఇటిక్యాల మండలంలోని 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఎన్‌ఎన్‌ఎస్ పరిశ్రమ నుంచి దుర్వాసన వెలువడకుండా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ మందా జగన్నాథ్ యాజమాన్యానికి సూచించారు. సోమవారం ఆయన ఫ్యాక్టరీ పరిసరాలను పరిశీలించారు. పరిశ్రమ జీఎం ప్రేమ్‌సింగ్‌తో మాట్లాడారు.