కదులుతున్న అక్రమాల డొంక

ABN , First Publish Date - 2021-11-27T04:06:18+05:30 IST

అయిజ మునిసిపాలిటీలో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

కదులుతున్న అక్రమాల డొంక
అయిజ మునిసిపాలిటీలో నిర్మిస్తున్న షట్టర్లు ఇవే(ఫైల్‌)

అయిజ మునిసిపాలిటీలో ఒక్కోటి వెలుగులోకి..

రియల్‌ ఎస్టేట్‌ మాఫియా ఆగడాలు

ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది అండదండలు

తాజాగా తప్పుడు డోర్‌ నంబర్లు, అసెస్‌మెంట్లతో ఆక్రమణలు

ఇంటి నకిలీ అనుమతులతో షట్టర్ల నిర్మాణాలు


అయిజ మునిసిపాలిటీలో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మొన్న అసైన్డ్‌ భూముల ఆక్రమణ, నిన్న తప్పుడు ఇంటి అనుమతులతో భూ యజమానికి తెలియకుండానే ప్లాట్ల విక్రయం బయట పడగా, నేడు తప్పుడు అసెస్‌మెంట్లు సృష్టించి వాటి ద్వారా భూములు దౌర్జన్యంగా ఆక్రమణకు ప్రయత్నించడం బహిర్గతమైంది. ఇలా ఒక్కటి కాదు.. రెండు కాదు మునిసిపాలిటీలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, ప్రజలు చెల్లించే పన్నులతో జీతం తీసుకుంటున్న అధికారులు, సిబ్బంది, అధికార పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇలా అందరూ ఈ అవినీతి అక్రమాల్లో భాగస్వాములుగా ఉంటున్నారు.

  • - ఆంధ్రజ్యోతి, గద్వాల


అయిజ మునిసిపాలిటీ అంటేనే గతంలో నుంచే అవినీతి అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంది. దాన్ని సరిదిద్ది, చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోప ణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదై, జైలు శిక్ష అనుభ వించి బయటికి వచ్చిన వారు మళ్లీ అదే అక్రమ దందాలోకి దిగుతున్నారు. 


అనుమతులకు విరుద్ధంగా..

సాధారణంగా మునిసిపా లిటీలో నిర్మాణాలకు ఇచ్చే అనుమ తులు కేటగిరీల వారీగా ఉంటాయి. ఇంటి నిర్మాణాలకు ఇచ్చే అనుమతులు, వాణిజ్య అవసరాల కోసం ఇచ్చే అనుమతులు వేరు వేరుగా ఉంటాయి. అయిజ మునిసిపాలిటీలో ఇంటి నిర్మాణాల కోసం అనుమతులు తీసుకుని షట్టర్లు నిర్మిస్తున్నారని పుర ప్రజలు ఆరోపిస్తున్నారు. మొత్తం 13 ఇళ్ల నిర్మాణాల కోసం అనుమతులు తీసుకొని సుమారు 53 షట్టర్లు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. టీఎస్‌ బీపాస్‌ లాంటి చట్టం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువ చ్చినా, క్షేత్ర స్థాయిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదనడానికి ఇదొక ఉదాహ రణగా చెప్పొచ్చు. ఎవరైనా ఆన్‌లైన్‌ ద్వారా ఇంటి నిర్మా ణం కోసం దరఖాస్తు చేసు కుంటే అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీ లించిన తర్వాత అనుమతులు ఇ వ్వాలి. ఒకవేళ ఒక నిర్మాణం కో సం అనుమ తి తీసుకుని, మరో నిర్మాణం చేస్తుం టే వారికి నోటీ సులు ఇచ్చి, సరైన వివరణ రాకపోతే క్రిమినల్‌ కేసులు నమో దు చేయాలి. కానీ, మాఫి యాతో అంటకాగుతున్న కొంత మంది సిబ్బంది ఇవేమి పట్టించుకోకుండా చోద్యం చూ స్తున్నారు. తాజాగా అయిజ పట్టణంలోని పెట్రోల్‌ బంక్‌ చౌరస్తాలో ఇచ్చిన ఇంటి నిర్మాణ అనుమతులు అసలైన వా? లేక నకిలీవా? సమా చారం ఇవ్వాలని అయ్యన్న అనే వ్యక్తి పురపాలిక అధికా రులకు దరఖాస్తు చేసుకు న్నారు. అసైన్డ్‌ భూముల్లో ఇచ్చిన అనుమ తులతో చేసిన రిజిస్ర్టేషన్‌ను రద్దు చేయాలని పుర ప్రజలు డిమాండ్‌ చేస్తు న్నారు. కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారి స్తేనే ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశాలు ఉన్నాయని ప్రజలు చర్చించు కుంటున్నారు. లేనిపక్షంలో పేద ప్రజల ఆస్తులను రియల్‌ ఎస్టేట్‌ మాఫియా మింగే యడం తోపాటు ప్రభుత్వ ఆ స్తులను కబ్జా చేస్తుందని, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని కాజేస్తుందని అంటున్నారు.


తాజా ఘటనలు ఇవే..

సాధారణంగా ఎప్పుడైనా అసెస్‌మెంట్‌ కోసమో లేదా డోర్‌ నెంబర్‌ కోసమో దరఖాస్తు చేసుకోవాలంటే సంబంధిత ప్లాన్‌ ప్రకారం ఆ సర్వే నెంబర్‌ లేదా ఆ ప్రాంతంలో ఇంటి నిర్మాణం జరిగి ఉండాలి. అప్పుడే దానికి అసెస్‌మెంట్‌ సర్టిఫికెట్‌ కానీ, డోర్‌ నెంబర్‌ కానీ ఇస్తారు. కానీ, అయిజ మునిసిపాలిటీ అధికారులకు ఇలాంటివేమి పట్టవని తెలుస్తోంది. అందుకే వ్యవసాయ పొలంలో ఎలాంటి నిర్మాణాలు లేకున్నా తప్పుడు అసెస్‌మెంట్‌ సర్టిఫికెట్లు, డోర్‌ నెంబర్లు తీసుకుంటున్నారు. తాజా ఘటన అందుకు అద్దం పడుతోంది. అయిజ శివారులోని 724 సర్వే నెంబర్‌లో మొత్తం 11.32 ఎకరాల భూమి ఉంది. ఈ వ్యవసాయ పొలంలో ఎలాంటి నిర్మాణాలు లేకున్నా 1,330 చదరపు గజాలలో డోర్‌ నెంబర్స్‌, అసెస్‌మెంట్‌ నెంబర్లు మునిసిపాలిటీ ఆఫీసు నుంచి పొందారని, వాటిని ఆధారంగా చేసుకుని తన భూమిలోకి దౌర్జన్యంగా ఆక్రమణకు వస్తున్నారని అల్లాసాబ్‌ అనే వ్యక్తి మంగళవారం అయిజ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే ఇందులో కూడా మాజీ ప్రజాప్రతినిధి భర్త, టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన నాయకుడు ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది. వీరి సహకారం, మునిసిపాలిటీ అధికారుల తోడ్పాటుతో తప్పుడు అసెస్‌మెంట్లు సృష్టించి ఆక్రమణకు ప్రయత్నిస్తున్నట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. 


Updated Date - 2021-11-27T04:06:18+05:30 IST