మోదీ చిత్ర పటానికి క్షీరాభిషేకం
ABN , First Publish Date - 2021-10-21T05:14:37+05:30 IST
కొవిడ్ వ్యాక్సి నేషన్ దేశంలో బుధవారంతో కోటి మందికి పూర్తైన సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసు పత్రి కొవిడ్ సెంటర్ ముందు ప్రధాని చిత్ర పటానికి బీజేపీ నాయకులు క్షీరాభిషేకం చేశారు.

నారాయణపేట, అక్టోబరు 20 : కొవిడ్ వ్యాక్సి నేషన్ దేశంలో బుధవారంతో కోటి మందికి పూర్తైన సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసు పత్రి కొవిడ్ సెంటర్ ముందు ప్రధాని చిత్ర పటానికి బీజేపీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వైద్య సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడు తూ ప్రపంచలోనే అతిపెద్ద జనాభా కల్గిన రెండో దేశమైన భారతదేశంలో మిగతా దేశాలతో పోలి స్తే ప్రాణనష్టం ఎక్కువగా జరుగకుండా అరికట్టి కోటి మందికి వ్యాక్సిన్ వేయించి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపారన్నారు. అంతకుముందు కేంద్ర ఫ్రభుత్వం పీఎం సీఏఆర్‌ఈఎస్ నిధుల ద్వారా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంజూరు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను బీజేపీ బృందం సందర్శించింది. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సత్యయాదవ్, నాయకులు ప్రభాకర్ వర్దన్, రఘువీర్, వెంకట్రాములు, వెంకటయ్య, లక్ష్మీశ్యాంసుందర్, సత్య రఘుపాల్, రమేష్, రఘు రామయ్య, రాము, చిన్న రఘు, హన్మంత్‌రావు, సతీష్, సాయిబన్న, పాల్గొన్నారు.
నారాయణపేట టౌన్ : కొవిడ్ టీకా వంద కోట్ల మందికి పూర్తైన సందర్భంగా బీజేపీ నాయకులు దామరగిద్ద మండల కేంద్రంలో మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. బీజేపీ మండలాధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా నాయకుడు గోపాల్ మాట్లాడుతూ మోదీ నాయకత్వాన్ని ప్రంపంచ దేశాలు సైతం అభినందిస్తున్నారన్నా రు. కార్యక్రమంలో నాయకులు అశోక్, వెంకటప్ప, కన్కప్ప, వెంకటేష్, మోహన్‌రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మప్ప, నర్సిములు ఉన్నారు.
ధన్వాడ : కొవిడ్ టీకాలు వేయడంలో వైద్య సిబ్బంది చేసిన కృషిని అభినందిస్తూ బుధవారం ధన్వాడ, కిష్టాపూర్, గున్ముక్ల గ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని శాలువా, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో బీజే పీ మండల ప్రధాన కార్యదర్శి రాఘవేందర్‌గౌడ్, ప్రవీణ్‌రెడ్డి, చక్రి, కురుమూర్తి, విష్ణువర్ధన్‌రెడ్డి, సతీష్‌గౌడ్ పాల్గొన్నారు.
మద్దూర్ : దేశంలో వంద కోట్ల టీకాలు వేయడం పట్ల బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్య క్రమంలో సుధాకర్‌రెడ్డి, శంకర్, చారి పాల్గొన్నారు.