ఆడబిడ్డలకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-12-31T05:30:00+05:30 IST

ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటోందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

ఆడబిడ్డలకు అండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
కేటీదొడ్డిలో కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి 

- కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కేటీదొడ్డి/గద్వాల టౌన్‌, డిసెంబరు 31 : ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటోందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కేటీదొడ్డి, మైలగడ్డ, ఉమిత్యాల, రంగాపురం, కొండాపురం, వెంకటాపురం, పాగుంట, ఇర్కిచేడు గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటిం చారు. ఆయా గ్రామాల్లోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఆడపిల్ల పెళ్లికి కానుకగా కుల మతాలు, పార్టీలకు అతీతంగా కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. పేద ప్రజలు శుభకార్యాలు, వివాహ వేడుకలను నిర్వ హించుకునేందుకు కమ్యూనిటీహాల్‌ నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. త్వరలోనే పనులను ప్రారంభించనున్నామన్నారు. కార్యక్రమం లో జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌, వైస్‌ ఎంపీపీ రామకృష్ణనాయుడు, మండల అధ్యక్షుడు ఉరుకుం దు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు హన్మంతు, నాయకులు వెంకటేష్‌, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.  


బాధిత కుటుంబానికి పరామర్శ

మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన మైబు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరా మర్శించారు. అదే గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు  గోవిందు ఇటీవల మృతి చెందాడు. వారి కుటుంబ సభ్యులను కూడా ఎమ్మెల్యే పరామ ర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


క్యాలెండర్ల ఆవిష్కరణ

అవోపా క్యాలెండర్‌-2022ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఇళ్లల్లో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలను పాటించాలని కోరారు. మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని చెప్పారు. కార్యక్రమంలో అవోపా జిల్లా అధ్యక్షుడు మరిడి శ్రీకాంత్‌, ప్రధాన కార్యదర్శి చిలుకూరి శివశంకర్‌, ఆర్థిక కార్యదర్శి ఆర్‌ఆర్‌ సుధీర్‌, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు మేడిశెట్టి బాలస్వామి, పట్టణ అధ్యక్షుడు నందిమల్ల సురేష్‌, ప్రధాన కార్యదర్శి నరహరి శ్రీనివాసులు, కోశాధికారి బిలకంటి రాము, పోలిశెట్టి వీరబాబు, కొండ వెంకటేష్‌, యువజన సంఘం అధ్యక్షుడు బిలకంటి సురేష్‌, బాణాల రమణ, మోడీ వెంకట రమణ, మహిళ సంఘం కోశాధికారి శ్రావణి, కౌన్సిలర్‌ చిదిరి రామకృష్ణ పాల్గొన్నారు. 


- పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పీఆర్‌టీయూ టీఎస్‌ క్యాలెండర్‌, డైరీలను అవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు తిమ్మారెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి వేణుగోపాల్‌, గౌరవ అధ్యక్షుడు నర్సింహ్మారెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-12-31T05:30:00+05:30 IST