రైతుల అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2021-12-29T05:28:45+05:30 IST

రైతుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని,

రైతుల అభివృద్ధికి  కృషి
రైతు సంబురాలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- బోయలగూడెంలో రైతు సంబురాలు ప్రారంభం 

గట్టు, డిసెంబరు 28 : రైతుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, వారిని ఆదుకొనేందుకు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గట్టు మండలంలోని బోయలగూడెం గ్రామంలో లక్ష్మీవెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన రైతు సంబురాలను ఆయన ప్రారంభించారు. అంతకుముందు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం రైతు సంబురాలను, రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో బోయలగుడ్డం చెరువుకు కాలువ ద్వార నీటిని విడుదల చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ మేకల సుమతి, సర్పంచ్‌ రాణి వీరేష్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 


త్వరలో గట్టు ఎత్తిపోతల పనులు

త్వరలోనే గట్టు ఎత్తిపోతల పనులను ప్రారంభించి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ అన్నారు. మండలంలోని బోయల గూడెం, ఇందువాసి, చమ్మన్‌ఖాన్‌దొడ్డి, బల్గెర, ఆరగిద్ద, గొర్లఖాన్‌దొడ్డి, తప్పెట్లమొర్సు గ్రామాలకు చెందిన 66 మంది లబ్ధిదారులకు మంగళవారం ఆయన ఇంటిం టికీ తిరిగి చెక్కులకు అందించారు. అలాగే సీఎం సహాయ నిధి చెక్కులను కూడా లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్‌, జడ్పీటీసీ సభ్యురాలు శ్యామల, వైస్‌ ఎంపీపీ సుమతి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేష్‌, సర్పంచుల సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు, నాయ కులు రామకృష్ణారెడ్డి, సంతోష్‌, జమ్ము రామన్‌గౌడ్‌ పాల్గొన్నారు. 


కబడ్డీ టోర్నమెంట్‌ ప్రారంభం

ధరూరు : క్రిస్మస్‌, నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా ధరూరు మండలంలోని ర్యాలంపాడులో ఏర్పాటు చేసిన కబడ్డీ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. కానిస్టే బుల్‌ ఉద్యోగాలు సాధించిన ఇద్దరు యువకులను సన్మానించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్‌ కర్రెమ్మ, నాయకులు చిట్టెం పురుషోత్తమ్‌రెడ్డి,  జాకీర్‌, రామన్‌గౌడు, రామకృష్ణ నాయుడు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-29T05:28:45+05:30 IST