అభిమానులు ప్రజా సేవలో ముందుండాలి
ABN , First Publish Date - 2021-05-21T04:37:57+05:30 IST
సినీ హీరోల అభిమానులు ప్రజా సేవలో ముందుండాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల అర్బన్, మే 20 : సినీ హీరోల అభిమానులు ప్రజా సేవలో ముందుండాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం కొవిడ్ వార్డులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కరోనా బాధితులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్‌ల చేతుల మీదుగా పండ్లు, బ్రెడ్డు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిరు ముదిరాజ్, వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్, సుభాన్, నరసింహ, వీరేష్, శాలు, శ్రీను పాల్గొన్నారు.